ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాజ్‌వేపై వరద నీరు.. రాకపోకలకు బేజారు

ABN, First Publish Date - 2022-08-18T05:41:09+05:30

బూర్జపాడు- డొంకూరు మధ్య ఉప్పుటేరు వద్ద ఉన్న కాజ్‌వేపై వరద నీరు నిల్వ ఉండడంతో విద్యార్థులు, రైతులు, కూలీలు, ద్విచక్ర వాహన చోదకులు అవస్థలకు గురవుతున్నారు.

సైకిళ్లపై ప్రమాదకరంగా కాజ్‌వే దాటుతున్న విద్యార్థులు:
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


  సముద్రంలోకి మళ్లింపునకు చర్యలు తీసుకోని అధికారులు 

  ప్రజలకు తప్పని ఇబ్బందులు


ఇచ్ఛాపురం రూరల్‌: బూర్జపాడు- డొంకూరు మధ్య ఉప్పుటేరు వద్ద ఉన్న కాజ్‌వేపై వరద నీరు నిల్వ ఉండడంతో విద్యార్థులు, రైతులు, కూలీలు, ద్విచక్ర వాహన చోదకులు అవస్థలకు గురవుతున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ఊప్పుటేరు వద్ద నీటి ఉధృతి కొనసాగుతోంది. మూడురోజులుగా వరద తగ్గడంలేదు. ఇక్కడ నీటిని సముద్రం లోకి అధికారులు మళ్లింపునకు చర్యలు తీసుకోవడంలేదని  తీరప్రాంత వాసులు, విద్యార్థులు, రైతులు, కూలీలు వాపోతు న్నారు. కాగా తహసీల్దార్‌ ఎం.లావణ్య మంగళవారం  కాజ్‌వే వద్ద పరిశీలించిన విషయం విదితమే. నీటిని మళ్లించాలని సర్పంచ్‌, ఎంపీటీసీ సభ్యులకు ఆమె సూచించి వెళ్లిపోయారు. అఽధికారులు తక్షణమే స్పందించి పొగురుతీత పనులు చేపట్టి నీటిని సముద్రంలోకి మళ్లించాలని రైతులు కోరుతున్నారు. 

సముద్రంలోకి నీటిని మళ్లించాలి

బూర్జపాడు వద్ద వరదనీటిలో మునిగిన నాట్లను వ్యవసాయాధికారి బి.నరసిం హమూర్తి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  నీటిని సముద్రంలోకి మళ్లించేందుకు చర్యలు తీసుకోవాలని  సర్పం చ్‌ బి.మోహ నాంగి, తహసీల్దార్‌ను కోరారు. గురువారం నాటికి నీరు తొలగిస్తే పంటలకు ఇబ్బంది ఉండదన్నారు. పొలాల్లో నీరు బయటకు వెళ్లిన  వెంటనే యూరియా, పొటాష్‌తో బూస్టర్‌ మోతాదు ఎరువులు వేస్తే వరిపైరు సాధారణ స్థితికి వస్తుందని రైతులకు సూచించారు. 



Updated Date - 2022-08-18T05:41:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising