ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘బాధ్యులపై అట్రాసిటీ కేసు నమోదు చేయండి’

ABN, First Publish Date - 2022-05-29T06:04:37+05:30

కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరును వ్యతిరేకిస్తూ విధ్వంసాన్ని సృష్టించిన దుండగులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి శిక్షించాలని సమతా సైనిక్‌ దళ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా రామారావు డిమాండ్‌ చేశారు. శనివారం మండల పరిషత్‌ కార్యాలయం ఎదురుగా ఉన్న అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలిపారు.

అంబేడ్కర్‌ విగ్రహానికి పాలభిషేకం చేస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


కోటబొమ్మాళి: కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరును వ్యతిరేకిస్తూ విధ్వంసాన్ని సృష్టించిన దుండగులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి శిక్షించాలని సమతా సైనిక్‌ దళ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా రామారావు డిమాండ్‌ చేశారు. శనివారం మండల పరిషత్‌ కార్యాలయం ఎదురుగా ఉన్న అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోనసీమ జిల్లాను అంబేడ్కర్‌ కోన సీమ జిల్లాగా కొనసాగించాలని కోరారు. మాజీ కారు డ్రైవర్‌ సుబ్రహ్మణ్యంను హత్య చేసిన ఎమ్మెల్సీ అనంతబాబును కఠి నంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సామ సంజీవరావు, కె.భాస్కర్‌రావు, కుంచి అంజి పాల్గొన్నారు. 


అంబేడ్కర్‌ విగ్రహానికి పాలభిషేకం

పాతపట్నం: కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరును ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన విధ్వంసాన్ని ఖండిస్తూ శనివారం స్థానిక కోర్టు కూడలిలో అంబేడ్కర్‌ యువజన సంఘం ప్రతినిధులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్‌ సుదర్శనం, యజ్జల భాస్కరరావు మాట్లాడుతూ.. కోనసీమకు అంబేడ్కర్‌ జిల్లాగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. అంబేడ్కర్‌ విగ్ర హానికి పాలభిషేకం చేశారు. కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు సిర్ల ప్రభాకరరావు, సిర్ల జోగారావు, కొప్పల అప్పారావు, దార గరికయ్య,  తదితరులు పాల్గొన్నారు.

 

Updated Date - 2022-05-29T06:04:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising