పోరాట యోధుడు సుబ్బారావు పాణిగ్రాహి
ABN, First Publish Date - 2022-12-22T23:59:59+05:30
శ్రీకాకుళ సాయుధ పోరాటంలో 53 సంవత్సరాల కిందటే పోరాట పటిమను ప్రదర్శించిన యోధుడు సుబ్బారావు పాణిగ్రాహి అని పలువురు వక్తలు అన్నారు. సూదికొండ అంబేడ్కర్ కాలనీలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో సుబ్బారావు పాణిగ్రాహి వర్ధంతిని గురువారం నిర్వహిం చారు. ఈ సందర్భంగా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నాగన్న మాట్లాడుతూ.. దేశంలో జరుగుతున్న అనేక పోరాటా లకు దిక్సూచి శ్రీకాకుళ సాయుధ పోరాటం అని అన్నారు.
పలాస: శ్రీకాకుళ సాయుధ పోరాటంలో 53 సంవత్సరాల కిందటే పోరాట పటిమను ప్రదర్శించిన యోధుడు సుబ్బారావు పాణిగ్రాహి అని పలువురు వక్తలు అన్నారు. సూదికొండ అంబేడ్కర్ కాలనీలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో సుబ్బారావు పాణిగ్రాహి వర్ధంతిని గురువారం నిర్వహిం చారు. ఈ సందర్భంగా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నాగన్న మాట్లాడుతూ.. దేశంలో జరుగుతున్న అనేక పోరాటా లకు దిక్సూచి శ్రీకాకుళ సాయుధ పోరాటం అని అన్నారు. ఆనాడు ప్రజల కోసం పోరాటం చేసిన వ్యక్తుల్లో సుబ్బారావు పాణిగ్రాహితో పాటు మరో ఐదుగురు యోధులను పోలీసులు నిర్బంధించి బూటకపు ఎన్‌కౌంటర్ చేశారన్నారు. ప్రజల కోసం ప్రాణాలర్పించిన పోరాట యోధులను స్మరించుకోవడం మనందరి కర్తవ్యమన్నారు. అరు ణోదయ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు సన్నశెట్టి రాజశేఖర్ మాట్లాడుతూ.. సుబ్బారావు పాణిగ్రాహి సిక్కోలు యుద్ధ సాహిత్యాన్ని సాయుధం చేసి చరితార్థుడయ్యారని కొనియాడారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు మార్పు మల్లేశ్వరరావు, బి.జగన్నాథరావు, ఎం.ఖగేశ్వరరావు, ఎస్.గోపి, బద్రి కూర్మారావు, ప్రభాకర్, డి.గణేష్, విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
బొడ్డపాడులో...
పలాసరూరల్: శ్రీకాకుళం సాయుధ గిరిజన రైతాంగ పోరాట యోధుడు సుబ్బారావు పాణిగ్రాహి వర్థంతి సందర్భంగా బొడ్డపాడు అమరవీరు స్మారక మందిరంలో గురువారం ఆయన చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి వంకల మాధవరావు మాట్లాడుతూ శ్రీకాకుళం సాయుధ పోరాటం దేశ చరిత్రలోనే ఒక గొప్ప పోరాటంగా నిలిచిం దన్నారు. ఈ ఉద్యమంలో సుబ్బారావు పాణిగ్రాహి ఒక చేత పెన్ను, మరో చేత గన్ను పట్టుకొని విరోచితంగా పోరాడారని కొనియాడా రు. కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు తామాడ సన్యాసి రావు, జి.బాలకృష్ణ, మద్దిల వినోద్, సొర్ర రామారావు, కె.సోమేశ్వర రావు, కుమార్, మామిడి భీమారావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-23T00:00:00+05:30 IST