రైతులకు మద్దతుగా ఉండాలి
ABN, First Publish Date - 2022-10-08T04:55:23+05:30
రైతులకు మద్దతుగా ఉండాలి
పాతపట్నం: అమరావతి సాధనకై రైతులు చేపడుతున్న పోరాటానికి మనమంతా మద్దతుగా నిలుద్దామని మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ అన్నారు. తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం పార్టీ నాయకులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పార్టీ సభ్యత్వ నమోదు, ఓటరు లిస్టు వెరిఫికేషన్ వేగవంతం చేయాలన్నారు. బూత్‌లెవెల్ ఏజెంట్లను నియామకం చేసి బూత్‌లెవెల్ అధికారులకు తెలియజేయాలన్నారు. 17 ఏళ్ల వయసు నిండిన ప్రతీ ఒక్కరికీ ఓటరు జాబితాలో చేర్చేదిశగా చొరవచూపాలన్నారు. నూతన పట్టభధ్రుల ఓట్లు చేర్పించాలన్నారు. పార్టీ నాయకులు పైల లక్ష్మయ్య, పైల బాబ్జీ పాల్గొన్నారు.
Updated Date - 2022-10-08T04:55:23+05:30 IST