ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బందోబస్తు నడుమ దిమ్మిడిజోల హైస్కూల్‌ కమిటీ ఎన్నిక

ABN, First Publish Date - 2022-08-13T05:26:06+05:30

దిమ్మిడిజోల ఉన్నత పాఠశాల తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక భారీ పోలీసు బందోబస్తు నడుమ మళ్లీ శుక్రవారం నిర్వహించారు. గత ఏడా ది సెప్టెంబర్‌ 22న నిర్వహించిన కమిటీని రద్దు చేసినట్లు ప్రకటించకుండానే మళ్లీ ఎన్నిక నిర్వహించడంపై ఎంఈవో నర్శింహుల్ని అప్పటి చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌లు ఎస్‌.పద్మావతి, దండాసి, పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు నిలదీ శారు.

ఎంఈవో జి.నర్సింహుల్ని ప్రశ్నిస్తున్న గత చైర్మన్‌, సభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాత కమిటీ రద్దుపై తేల్చని అధికారులు

నందిగాం: దిమ్మిడిజోల ఉన్నత పాఠశాల తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక భారీ పోలీసు బందోబస్తు నడుమ మళ్లీ శుక్రవారం నిర్వహించారు. గత ఏడా ది సెప్టెంబర్‌ 22న నిర్వహించిన కమిటీని రద్దు చేసినట్లు ప్రకటించకుండానే మళ్లీ ఎన్నిక నిర్వహించడంపై ఎంఈవో నర్శింహుల్ని అప్పటి చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌లు ఎస్‌.పద్మావతి, దండాసి, పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు నిలదీ శారు. కలెక్టర్‌ మౌఖిక ఆదేశాలు, ఏపీసీ ఉత్తర్వుల మేరకు ఎన్నిక నిర్వహి స్తున్నామని ఎంఈవో తెలిపారు. దీంతో  పాఠశాల ఆవరణలో ఉద్రిక్త వాతా వరణం ఏర్పడింది. నందిగాం, టెక్కలి-2 ఎస్‌ఐలు మహ్మద్‌ అమీర్‌ ఆలీ, ఎస్‌. గోపాలరావు పర్యవేక్షణలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల అధికారిగా నందిగాం హైస్కూల్‌ హెచ్‌ఎం వై.హరిబాబు వ్యవహరించారు. ఎన్నిక విష యంలో అధికారులు ఏకపక్షంగా నిర్వహించారని టీడీపీ మద్దతు దారులు ఆరో పించారు. ఎన్నికకు హాజరైన పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రుల వివరాలు కోరడంతో అక్కడ వాతావరణం వేడెక్కింది. పోలీసులు కలుగజేసుకొని ఇరు వర్గాలను బయటకు రప్పించారు. 

న్యాయపోరాటం చేస్తాం

టీడీపీ రాష్ట్ర లీగల్‌సెల్‌ ఉపాధ్యక్షుడు పినకాన అజయ్‌కుమార్‌, నాయకులు పి.చంద్రశేఖర్‌, ఎం.బాలకృష్ణ మాట్లాడుతూ.. పాఠశాల కమిటీ ఎన్నికపై హైకోర్టులో న్యాయ పోరాటం చేస్తామన్నారు. ఎన్నికపై ఎంఈవోను ప్రశ్నించగా గతంలో ఎన్నికపై జేసీ ఆదేశాల మేరకు విచారణ జరిగిందని, దర్యాప్తు చేపట్టి నివేదికను సమర్పించామని, గతంలో కోరం లేకుండా ఎన్నిక నిర్వహించారన్న అభియోగం వల్లే ఎన్నికలు మళ్లీ నిర్వహించామన్నారు. అయితే ఎన్నిక సమ యంలో హెచ్‌ఎం, ఇన్‌చార్జి హెచ్‌ఎం లేక పోవడం విశేషం. నూతన చైర్మన్‌గా కొల్లి కల్యాణి, వైస్‌చైర్మన్‌గా పోలాకి ముకుం దరావు ఎన్నికైనట్లు ప్రకటించి  సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.

  

Updated Date - 2022-08-13T05:26:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising