గ్రామాల అభివృద్ధికి ముందస్తు ప్రణాళికలు దోహదం
ABN, First Publish Date - 2022-12-07T23:20:56+05:30
గ్రామపంచాయతీల అభివృద్ధికి ముందస్తు ప్రణాళికలు దోహదం చేస్తాయని మండల ప్రత్యేకాధికారి బి.మురళీకృష్ణ అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం ఎంపీడీవో హెచ్‌వీ రమణమూర్తి ఆధ్వర్యంలో సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ తరగతులను ప్రారంభించారు.
నందిగాం: గ్రామపంచాయతీల అభివృద్ధికి ముందస్తు ప్రణాళికలు దోహదం చేస్తాయని మండల ప్రత్యేకాధికారి బి.మురళీకృష్ణ అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం ఎంపీడీవో హెచ్‌వీ రమణమూర్తి ఆధ్వర్యంలో సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ తరగతులను ప్రారంభించారు. రీసోర్స్‌పర్సన్లు కె.సంతోష్‌కుమార్, సీహెచ్ ఢిల్లేశ్వరరావు శిక్షణ అంశాలను వివరించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీలు సువ్వారి వసంతకుమార్, ఆర్.లక్ష్మీ కాంతం, ఈవో పీఆర్డీ టి.రాజారావు, పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కార్యదర్శులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - 2022-12-07T23:20:57+05:30 IST