టీలో మత్తుమందు కలిపి..
ABN, First Publish Date - 2022-12-16T23:26:27+05:30
పట్టణంలోని మారుతీనగర్‌కు చెందిన శాసనపురి ధనేశ్వరరావు (బాబు) రైలులో ప్రయాణం చేస్తుండగా టీలో మత్తుమందు కలిపి నిలువ దోపిడీ చేసిన ఘటన చోటు చేసుకుంది.
- రైలులో నిలువు దోపిడీ.. బంగారు ఆభరణాలు, నగదు అపహరణ
- ఒడిసాలో ఘటన
- బాధితుడు నరసన్నపేట వాసి
నరసన్నపేట: పట్టణంలోని మారుతీనగర్‌కు చెందిన శాసనపురి ధనేశ్వరరావు (బాబు) రైలులో ప్రయాణం చేస్తుండగా టీలో మత్తుమందు కలిపి నిలువ దోపిడీ చేసిన ఘటన చోటు చేసుకుంది. బంగారు ఆభరణాలతోపాటు నగదు అపహరించు కుపోయారు. బాధితుడు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు... ధనేశ్వరరావు ఈ నెల 14న బంధువులతో కలిసి పూరిలో జరిగిన ఒక వివాహ వేడుకకు వెళ్లాడు. వివాహం అనంతరం బరంపురంలో ఎలక్ర్టానిక్ వస్తువులు కొనుగోలు చేసేందుకు పూరి నుంచి ఒక్కడే గురువారం రైలులో బయలుదేరాడు. ఈ క్రమంలో తోటి ప్రయాణికుల్లో కొందరు మాటలు కలిపి ఖుర్దా స్టేషన్ దాటిన తర్వాత టీ ఇచ్చారు. అది తీసుకున్న ధనేశ్వరరావు కాసేపటికి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో అతడి చేతికి ఉన్న బంగారం బ్రాస్‌లెట్, ఉంగరాలు, మెడలో చైన్ కలిపి మొత్తం ఏడు తులాల బంగారంతో పాటు బ్యాగ్‌లో ఉన్న రూ.15 వేల సదరు వ్యక్తులు తస్కరించారు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని బరంపురం రైల్వే స్టేషన్‌లో దించేశారు. అక్కడ పడిఉన్న తనను రైల్వే పోలీసులు గుర్తించి ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. శుక్రవారం తెల్లవారు జామున తెలివి వచ్చిన తర్వాత జరిగిన విషయాన్ని రైల్వే పోలీసులకు తెలియజేశారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసినట్లు బాధితుడు తెలిపారు.
Updated Date - 2022-12-16T23:26:28+05:30 IST