ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అర్జీలు పెండింగ్‌లో ఉంచొద్దు: కలెక్టర్‌

ABN, First Publish Date - 2022-06-07T06:16:49+05:30

స్పందనలో వచ్చిన అర్జీలన్నీ పోర్టల్‌లో పెండింగ్‌ లేకుండా పరిష్కరించాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో కలెక్టర్‌ ఆధ్వర్యంలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు.

కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50



కలెక్టరేట్‌: స్పందనలో వచ్చిన అర్జీలన్నీ పోర్టల్‌లో పెండింగ్‌ లేకుండా పరిష్కరించాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో కలెక్టర్‌ ఆధ్వర్యంలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ... వివిధ శాఖలకు వచ్చిన ఫిర్యాదులు తక్షణం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అర్జీలు పెండింగ్‌లో ఉంటే సహించేదిలేదని హెచ్చరించారు. ఖాదీ వస్త్రాలకు అధికారులు, ఉద్యోగులు ప్రాధాన్యం ఇచ్చి, ఖాదీ కార్మికులను ప్రొత్సహించాలని  తెలిపారు. కార్యక్రమంలో జేసీ ఎం.విజయ సునీత, డీఆర్వో ఎం .రాజేశ్వరి, డీఆర్‌డీఏ పీడీ బి.శాంత్రిశ్రీ, డిప్యూటీ కలెక్టర్‌ జి. జయదేవి తదితరులు  పాల్గొన్నారు. 

ఫ లాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుకు ఎంపికైనట్టు జాబితాలో ఉన్న పేరును తొలగించి వేరొకరికి కేటాయించారని, తనకు న్యాయం చేయాలని సోంపేటకు చెందిన వి.శ్రీనివాసరావు కలెక్టర్‌కు విన్నవించుకున్నాడు. 2022 ఫిబ్రవరి 17 వైద్య ఆరోగ్యశాఖ జిల్లాలో 21 ల్యాబ్‌ టెక్నీషియన్స్‌ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసిందని, రిజర్వేషన్‌ ప్రాతిపధికన జాబితాలో  పేరు ఉన్నా మరొకరికి పోస్టుంగ్‌ ఇచ్చారని ఆవే దన వ్యక్తంచేశారు.దీనిపై విచారణకు కలెక్టర్‌ ఆదేశించారు. 


 పేటలో ఆక్రమణలపై కలెక్టర్‌కు ఫిర్యాదు 

నరసన్నపేట: నరసన్నపేట పట్టణంలో అఽధికార పార్టీ నాయ కుల ఆక్రమణ లపై మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి సోమవారం ‘స్పందన’ కార్యక్రమంలో కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లాఠ్కర్‌కు ఫిర్యాదు చేశారు. సత్యవరం జంక్షన్‌లో చెరువులో అక్రమ మట్టి తవ్వకాలు, రాజులు చెరువు గట్టుపై అక్రమ నిర్మాణాలతో పాటు మం డలంలో వైసీపీ నాయకులు ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్ర మంలో టీడీపీ నేతలు శిమ్మ చంద్రశేఖర్‌, బలగ నాగేశ్వరరావు, పీస కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


‘ఆక్రమిత భూములపై చర్యలు తీసుకోండి’

హిరమండలం: హిరమండలంలో ప్రభుత్వ భూములను ఆక్రమించుకునే వారిపై చర్యలు తీసుకోవాలని జడ్పీటీసి సభ్యుడు పొగిరి బుచ్చిబాబు కోరారు. సోమవారం కలెక్టరు శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌కు స్పందనలో ఫిర్యాదు చేశారు. వంశధార రిజర్వాయర్‌ నిర్మాణం కోసం సేకరించిన కోట్లాది రూపాయలు విలువ చేసే భూములను కొందరు ఆక్రమించుకొని నిర్మాణాలు చేపడుతున్నారని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఈ విషయమై ఇప్పటికే నీటి పారుదల శాఖాధికారులకు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోలేదన్నారు.  కోరాడ రెవెన్యూ పరిధిలో కొత్తగా ఏర్పా టు చేసిన అలికాం-బత్తిలి ప్రధాన రహదారి పక్కన రిజర్వాయర్‌ నిర్మాణానికి సేక రించిన సర్వే నెంబరు 306,307 భూమిలో దాబా నిర్మాణం జరుగుతుందని చెప్పా రు. ఈ భూమి విలువ సుమారు రూ.కోటి ఉంటుందన్నారు. ఎటువంటి అను మతులు లేకపోయినా విద్యుత్‌ కనెక్షన్‌ కూడా మంజూరు చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తక్షణం స్పందించి తగు చర్యలు తీసుకో వాలని ఆయన కోరారు.  


జిల్లా పోలీసు స్పందనకు 40 వినతులు

శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఏఎస్పీ కె.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. అర్జీదారులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మొత్తం 40 వినతులు అందగా... సివిల్‌  కేసులకు సంబంధించి 11, సైబర్‌ నేరాలపై ఒకటి, కుటుంబ వివాదాలపై ఆరు, ఇతర కారణాలపై 11, పాత ఫిర్యాదులుపై ఆరు, జిల్లా న్యాయసేవాధికార సంస్థకు పరిష్కారం కోసం ఐదు వినతులు అందాయి. కార్యక్రమం అనంతరం స్పందనకు అందుతున్న వినతులపై సకాలంలో స్పందించి చర్యలు తీసుకోవాలని అన్ని స్టేషన్ల సీఐలను, ఎస్‌ఐలను అదనపు ఎస్పీ ఆదేశించారు. 

 


Updated Date - 2022-06-07T06:16:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising