ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సక్రమంగా పౌష్టికాహారం పంపిణీ చేయండి

ABN, First Publish Date - 2022-10-12T04:44:47+05:30

అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారాన్ని సక్రమంగా పంపిణీచేయాలని ఆర్జేడీ జి.చిన్మయిదేవి ఆదేశించారు.

ఇచ్ఛాపురం: ఐసీడీఎస్‌ గోదాంను పరిశీలిస్తున్న ఆర్జేడీ:
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


  మహిళా శిశుసంక్షేమ శాఖ ఆర్జేడీ చిన్మయిదేవి

ఇచ్ఛాపురం/ రూరల్‌ : అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా  ప్రభుత్వం గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు  పౌష్టికాహారాన్ని సక్రమంగా  పంపిణీచేయాలని ఆర్జేడీ జి.చిన్మయిదేవి ఆదేశించారు. మంగళవారం ఇచ్ఛాపురంలోని ఐసీడీఎస్‌ కార్యాల యాన్ని, ఇనేసుపేట, ఇచ్ఛాపురం పట్టణంలోని అంగన్‌ వాడీ కేంద్రాలను పరిశీలిం చి రికార్డులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శిశుమరణాలు రేటు తగ్గించాలని, గర్భిణులు, బాలింతలు, ఆరునెలల నుంచి ఐదేళ్లలోపు చిన్నా రులకు అందించే సేవను పోషణ్‌ ట్రాకర్‌ యాప్‌లో డ్యాష్‌బోర్డులో నమోదు చే యాలని తెలిపారు. చిన్నారులు బరువు, ఎత్తులు  యాప్‌లో నమోదు చేయాలని పేర్కొన్నారు. అనంతరం అర్బన్‌ ఐసీడీఎస్‌ కార్యాలయం పరిధిలోని   కేంద్రాలకు పౌష్టికాహారం పంపిణీ  చేసే గోదాము  తనిఖీ చేశారు. స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఏసీడీపీవో బి.ఇందిర, ఐసీడీఎస్‌ నోడల్‌ అధికారి శారద, సూపర్‌వైజర్‌ నీలవేణి, సుజాత, నీలిమ పాల్గొన్నారు.



 


Updated Date - 2022-10-12T04:44:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising