ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడేన్నరేళ్లలో అన్ని రంగాల్లో వినాశనం

ABN, First Publish Date - 2022-12-04T23:58:20+05:30

: సీఎం జగన్‌ మూడున్నరేళ్ల పాలనలో అన్నిరంగాల్లో వినాశనం తప్ప అభివృద్ధి కనిపించలేదని, పరి శ్రమలూ ఇతర రాష్ట్రాలకు తరలి పోవాల్సిన ఖర్మ పట్టిందని మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. ఆదివారం దీర్గాశిలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ వెళ్లి వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వివరించారు.

ఇంటింటికీ కరపత్రాలు పంపిణీ చేస్తున్న బగ్గు రమణమూర్తి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దీర్గాశిలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం

దీర్గాశి(పోలాకి): సీఎం జగన్‌ మూడున్నరేళ్ల పాలనలో అన్నిరంగాల్లో వినాశనం తప్ప అభివృద్ధి కనిపించలేదని, పరి శ్రమలూ ఇతర రాష్ట్రాలకు తరలి పోవాల్సిన ఖర్మ పట్టిందని మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. ఆదివారం దీర్గాశిలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ వెళ్లి వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. వైసీపీ పాలనపై ప్రజలు విసిగెత్తిపోయారన్నారు. జగన్‌ పాదయాత్రలో ఇచ్చిన హామీలను మరిచి పోయారని విమ ర్శించారు. ప్రత్యేక హోదా నుంచి సీపీఎస్‌ రద్దు, పెట్రోల్‌, డీజిల్‌, విద్యుత్‌, ఆర్టీసీ చార్జీలను పెంచి అన్ని వర్గాలను మోసం చేశారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని ఓడించి చంద్రబాబును మరలా సీఎంగా చేస్తే అన్నివర్గాల ప్రజలు ఆనందంగా ఉంటారని పేర్కొన్నారు. రచ్చబండ వద్ద సమావేశం నిర్వహించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కోనేరు వద్ద నుంచి దీర్గాశి వరకు పాదయాత్ర చేశారు. కార్యక్రమంలో నేతలు రోణంకి కృష్ణంనాయుడు, బైరి భాస్కరరావు, నల్లాన వెంకునాయుడు, మల్లేశ్వరరావు, లుకలాపు రాంబాబు, మైలపల్లి త్రినాథరావు, తర్ర లక్ష్మీనారాయణ, పంచిరెడ్డి సింహాచలం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-04T23:58:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising