ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దుకాణం ఖాళీ చేశారని..

ABN, First Publish Date - 2022-01-29T03:50:24+05:30

కొత్తపేటలోని రెడ్డి షాపింగ్‌ కాంప్లెక్స్‌లో దుకాణాన్ని ఖాళీ చేయించిన యజమాని తీరుపై అద్దెదారుడు నిరసన తెలిపాడు. కుటుంబంతో రహదారిపై బైఠాయించాడు. కొత్తపేటకు చెందిన కోరాడ క్రాంతి.. రెడ్డి షాపింగ్‌ కాంప్లెక్స్‌లోని ఓ అద్దె దుకాణంలో గిఫ్ట్స్‌ అండ్‌ బుక్‌హౌస్‌ నిర్వహిస్తున్నారు. షాపింగ్‌ కాంప్లెక్స్‌ యజమాని రాముపాత్రుని రంగారెడ్డి

రోడ్డుపై భైఠాయించిన క్రాంతి దంపతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- యజమాని తీరుపై అద్దెదారుడి నిరసన

- కుటుంబంతో రోడ్డుపై బైఠాయింపు

కోటబొమ్మాళి, జనవరి 28 : కొత్తపేటలోని రెడ్డి షాపింగ్‌ కాంప్లెక్స్‌లో దుకాణాన్ని ఖాళీ చేయించిన యజమాని తీరుపై అద్దెదారుడు నిరసన తెలిపాడు. కుటుంబంతో రహదారిపై బైఠాయించాడు. కొత్తపేటకు చెందిన కోరాడ క్రాంతి.. రెడ్డి షాపింగ్‌ కాంప్లెక్స్‌లోని ఓ అద్దె దుకాణంలో గిఫ్ట్స్‌ అండ్‌ బుక్‌హౌస్‌ నిర్వహిస్తున్నారు. షాపింగ్‌ కాంప్లెక్స్‌ యజమాని రాముపాత్రుని రంగారెడ్డి శుక్రవారం ఆ దుకాణాన్ని ఖాళీ చేయించారు. దుకాణంలోని కొన్ని వస్తువులను బయటపడవేశారు. దీంతో క్రాంతి తన భార్య అప్పలనరసమ్మ(కావ్య)తో కలిసి రోడ్డుపై బైఠాయించారు. యజమాని తీరుపై నిరసన తెలిపారు. కరోనా కారణంగా రెండు నెలలుగా అద్దె చెల్లింపు ఆలస్యమవుతోందని... రెండు రోజులు గడువు కోరినా యజమాని దారుణంగా ఖాళీ చేయించారని వాపోయారు. బయటపడేసిన సామగ్రి లోపల పెట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయమై యజమాని రంగారెడ్డి వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా.. తనకు ఈ దుకాణం అవసరమని, రెండు నెలలుగా ఖాళీ చేయాలని చెబుతున్నా.. పట్టించుకోవడం లేదన్నారు. అందుకే ఖాళీ చేయించాను తప్ప అద్దె కోసం కాదని స్పష్టం చేశారు. ఈ ఘటనతో కొత్తపేట-కోటబొమ్మాళి రహదారిలో ట్రాఫిక్‌  కు అంతరాయం కలిగింది. దీంతో ఎస్‌ఐ వై.రవికుమార్‌.. పోలీసు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఇద్దరితో చర్చించి.. సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు. అనంతరం ఈ సంఘటనపై క్రాంతి భార్య అప్పలనరసమ్మ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై ఎస్‌ఐ రవికుమార్‌ను వివరణ కోరగా.. ఇరువర్గాల మధ్య రాజీమార్గంతో సమస్య పరిష్కరిస్తామని తెలిపారు. 

 



Updated Date - 2022-01-29T03:50:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising