ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పట్టపగలే చోరీ

ABN, First Publish Date - 2022-05-23T05:14:41+05:30

పట్టణంలోని పాతబస్టాండ్‌ సమీపంలో ఓ కిరాణా వ్యాపారి ఇంట్లో ఆదివారం గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సుమారు 35 తులాల బంగారం, రూ.6 లక్షల నగదు చోరీకి అయినట్లు వ్యాపారి కొట్టం సోమేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్‌ఐ కామేశ్వరరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

బాధితులతో మాట్లాడుతున్న పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టెక్కలిలో కలకలం
కిరాణా వ్యాపారి ఇంట్లో దొంగతనం
బంగారం, నగదు అపహరణ
టెక్కలి రూరల్‌, మే 22:
పట్టణంలోని పాతబస్టాండ్‌ సమీపంలో ఓ కిరాణా వ్యాపారి ఇంట్లో ఆదివారం గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.  సుమారు 35 తులాల బంగారం, రూ.6 లక్షల నగదు చోరీకి అయినట్లు వ్యాపారి కొట్టం సోమేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్‌ఐ కామేశ్వరరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
పట్టణానికి చెందిన కె.సోమేశ్వరరావు, వెంకటరత్నం దంపతులు స్థానిక పాతబస్టాండ్‌ సమీపంలో కిరాణా షాపు నిర్వహిస్తున్నారు. బంధువులతో కలిసి ఆదివారం ఉదయం పలాసలో ఓ శుభకార్యానికి వెళ్లారు. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంటి మొదటి అంతస్తులోని తలుపులన్నీ తెరిచి ఉన్నాయి. ఆందోళనకు గురైన యజమాని సోమేశ్వరరావు ఇంట్లోకి వెళ్లి చూడగా రెండు బీరువాలు పగలకొట్టి, సామగ్రి చెల్లాచెదురుగా పడి ఉండడం గమనించాడు. బంగారం, నగదు చోరీ అయినట్లు నిర్ధారించుకుని స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. వెండి ఆభరణాలు సురక్షితంగా ఉండగా బంగారం, నగదును దొంగలు పట్టుకుపోయారు. సీఐ ఎం.వెంకటగణేష్‌, ఎస్‌ఐ ఎన్‌.కామేశ్వరరావు ఘటనా స్థలానికి వెళ్లి చోరీ జరిగిన తీరును పరిశీలించారు. కాశీబుగ్గ నుంచి వచ్చిన క్లూస్‌టీం ఆదివారం రాత్రి వేలిముద్రలు సేకరించింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కామేశ్వరరావు తెలిపారు. 

Updated Date - 2022-05-23T05:14:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising