ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులపై వరికోత భారం

ABN, First Publish Date - 2022-12-31T00:28:32+05:30

రైతులకు వరి పంట నూర్పిడి ఖర్చు తడిసిమోపెడవుతోంది. కోత యంత్రాలపై రోజురోజుకూ పెరుగుతున్న అద్దెలు మోయలేని భారంగా మారుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా యంత్ర యజమానులు గంటకు రూ.3,500పైగా వసూలు చేస్తున్నారు. రైతులు తమ బాధ ఎవరికీ చెప్పుకోలేక అవస్థలు పడుతున్నారు.

బాలకృష్ణాపురం పొలాల్లో వరి పంట కోస్తున్న యంత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమాంతం పెరిగిన యంత్రాల అద్దెలు

గంటకు రూ.3500 వరకు ఖర్చు

(ఇచ్ఛాపురం రూరల్‌)

రైతులకు వరి పంట నూర్పిడి ఖర్చు తడిసిమోపెడవుతోంది. కోత యంత్రాలపై రోజురోజుకూ పెరుగుతున్న అద్దెలు మోయలేని భారంగా మారుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా యంత్ర యజమానులు గంటకు రూ.3,500పైగా వసూలు చేస్తున్నారు. రైతులు తమ బాధ ఎవరికీ చెప్పుకోలేక అవస్థలు పడుతున్నారు. జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో సుమారు 5.50 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. మూడు వారాలుగా పలు మండలాల్లో కోతలు చేపడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో వరికోత యంత్రాలు అందుబాటులో లేకపోవడంతో కోతలు ఆలస్యమవుతున్నాయి. ప్రభుత్వం కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లకు హార్వేస్టరు యంత్రాలు సరఫరా చేయలేదు. దీంతో ఇతర జిల్లాలు, ఒడిశా నుంచి వరి కోత యంత్రాలను దళారుల ద్వారా ఇక్కడికి తెచ్చి కోతలు చేపడుతున్నారు. గత ఏడాది కన్నా ధరలు భారీగా పెంచి రైతులపై అదనపు భారం మోపుతున్నారు. గత ఏడాది వరి కోత యంత్రం గంటపాటు కోసి నూర్పిడి చేస్తే రూ.2200 వరకు వసూలు చేసేవారు. ఈ ఏడాది డీజిల్‌ రేట్లు పెరిగాయంటూ మరో రూ.1000 నుంచి 1500వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. గంటకు ఏరియాను బట్టి రూ.3000 నుంచి రూ.3,500 వరకు చెల్లించాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్టోబరులో కురిసిన వర్షాలు, వరదలకు పంటలు నష్టపోవడమేకాక చాలాచోట్ల వరి పంట నేలకొరిగింది. కింద పడిన వరిని కోత కోయడానికి సమయం ఎక్కువ పడుతుంది. ఎకరాకు కనీసం గంటన్నర కన్నా ఎక్కువ సమయం పడుతుంది. ఈ లెక్కన ఎకరాకు రూ.5,000 నుంచి రూ.5,500 వరకు ఖర్చువుతోందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం వరసగా డీజిల్‌ రేట్లు పెంచడంతో యంత్రాల అద్దెల భారంతో రైతులపై పడుతోందని ప్రజా సంఘాలు ఆందోళన చెందుతున్నారు.

సాగు గగనం

ప్రస్తుత పరిస్థితుల్లో వరిపంట సాగు గగనంగా మారింది. ప్రతి ఏడాదీ క్రిమిసంహారక మందులు, కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు, కూలీల ధరలు, ట్రాక్టర్ల అద్దెలు ధరలు పెరుగుతున్నాయి. గతంలో ఎకరాకు రూ.15 వేలు ఖర్చు చేసేవాళ్లం. ప్రస్తుతం రూ.20 వేలకు పైగా ఖర్చవుతోంది. నూర్పుల ధరలు కూడా పెరగడంతో రైతులకు ఏమీ మిగలడం లేదు.

- బోరుభద్ర అన్నపూర్ణ, మహిళా రైతు, బాలకృష్ణాపురం, ఇచ్ఛాపురం

Updated Date - 2022-12-31T00:28:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising