భగవద్గీత పోటీ విజేతలకు అభినందన
ABN, First Publish Date - 2022-12-07T23:25:57+05:30
ఇటీవల గీతా జయంతి రోజున విశ్వహిందూ పరిషత్ పలాస డివిజన్ పరిధిలో నిర్వహించిన భగవద్గీత పఠన పోటీలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బుధవారం అభినందించారు.
కాశీబుగ్గ: ఇటీవల గీతా జయంతి రోజున విశ్వహిందూ పరిషత్ పలాస డివిజన్ పరిధిలో నిర్వహించిన భగవద్గీత పఠన పోటీలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బుధవారం అభినందించారు. ఈ పోటీలో అన్న, చెల్లెలు ఆర్.శ్రీయాన్సు, శ్రీహితలకు ప్రథమ, ద్వితీయ బహుమతులు వచ్చాయి. మఽధు లిక పండా కన్సోలేషన్ బహుమతిని సాధించింది. బుధవారం ఎస్‌ఎఫ్‌ఎస్ పాఠశాలలో ఫాదర్ రాజ్‌కుమార్ విజేతలకు సర్టిఫి కేట్‌లు, జ్ఞాపిక అందించి అభినందించారు. కార్యక్రమంలో వీ హెచ్‌పీ సభ్యురాలు బి.సరితమ్మ, ఉపాధ్యాయులు శశిభూష ణరావు, జయలక్ష్మి, బి.మీనాక్షి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-07T23:25:58+05:30 IST