ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూముల రీసర్వే పూర్తి

ABN, First Publish Date - 2022-08-12T06:06:46+05:30

రాష్ట్రంలో చేపట్టిన జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష పథకం రీ సర్వే దాదాపు పూర్తయ్యిందని ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం అన్నారు. గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం జిల్లాల కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు.

సమావేశంలో మాట్లాడుతున్న అజేయ కల్లం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అక్టోబరు 2న నాటికి పాస్‌ పుస్తకాల పంపిణీ
 ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయకల్లం
కలెక్టరేట్‌, ఆగస్టు 11:
రాష్ట్రంలో చేపట్టిన జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష పథకం రీ సర్వే దాదాపు పూర్తయ్యిందని ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం అన్నారు.  గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం జిల్లాల కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లతో  సమావేశం  నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘అక్టోబరు రెండు నాటికి మూడు జిల్లాల్లో సుమారు 400 గ్రామాల్లో భూ హక్కు పాస్‌ పుస్తకాలను పంపిణీ చేయనున్నాం. రీసర్వేతో  90 శాతం భూ సమస్యలు పరిష్కారమయ్యాయి. దీనిపై రైతులు కూడా సంతృప్తికరంగా ఉన్నారు.  30 శాతం  రోడ్‌ ఫైయింగ్‌ కూడా పూర్తయింది. రికార్డులను ఎవరూ మార్చలేని విధంగా,  ట్యాంపర్‌ చేయలేని విధంగా పారదర్శకంగా రూపొందించాలని ముఖ్యమంత్రి నిర్ణయించా రు’ అని తెలిపారు. కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ మాట్లాడుతూ.. జిల్లాలో తొమ్మిది లక్షల 86 వేల ఎకరాల్లో భూ సర్వే చేపట్టాల్సి ఉందన్నారు. ఇందులో 1,466 గ్రామాలు ఉన్నాయని తెలిపారు. ఈ నెల తొమ్మిది నాటికి శ్రీకాకుళం డివిజన్‌లో 97, టెక్కలి డివిజన్‌లో 56, పలాస డివిజన్‌లో 40 గ్రామాల్లో రీసర్వే నోటిఫికేషన్‌ పూర్తయ్యిందని చెప్పారు. అక్టోబర్‌ రెండు నాటికి 480 గ్రామాల్లో సర్వే పూర్తవుతుందని వివరించారు.   సమావేశంలో సర్వేల్యాండ్‌ రికార్డ్స్‌ కమిషనర్‌ సిద్ధార్థ్‌ జైన్‌, అదనపు సంచాలకులు శ్రీనివాసరావు, విజయనగరం, పార్వతీపురం జిల్లాల కలెక్టర్లు సూర్యకుమారి, నిశాంత్‌ కుమార్‌, శ్రీకాకుళం జేసీ ఎం.విజయసునీత, తదితరులు పాల్గొన్నారు.

 
 

Updated Date - 2022-08-12T06:06:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising