ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీ, బిస్కట్ల కోసం రావాలా?

ABN, First Publish Date - 2022-10-07T05:48:43+05:30

టీ, బిస్కట్ల కోసం రావాలా?

హౌసింగ్‌ ఏఈని ప్రశ్నిస్తున్న సభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- అధికారుల గైర్హాజరుపై సభ్యుల ఆగ్రహం

- మండల సమావేశంలో టీడీపీ ఎంపీటీసీల మండిపాటు

పొందూరు: కీలకమైన అధికారులు సమావేశా నికి రాకపోతే సమావేశాలు ఎందుకు నిర్వహించాల ని, టీ, బిస్కట్ల కోసం మేము రావాలా? టీడీపీ ఎంపీటీసీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీపీ కిల్లి ఉషారాణి అధ్యక్షతన గురువారం మండల పరిషత్‌ సాధారణ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కీలకమైన కొన్ని శాఖల అధికారులు హాజరు కాకపోవ డంతో టీడీపీ ఎంపీటీసీ సభ్యులు కె.ప్రమీల, హనుమం తురావు, బి.హారిక తదితరులు ఎంపీడీవో హరిహర రావును ప్రశ్నించారు. హాజరుకాని అధికారు లపై ఏమి చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇంకొన్ని శాఖల అధికారులు వస్తున్నా.. వారి దగ్గర పూర్తిస్థాయి సమాచారం ఉండదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా టీడీపీ ప్రభుత్వ హయాం లో మంజూరైన గృహాలకు నిధులు మంజూరులో అ ధికారులు పక్షపాతం చూపించడం సరికాదని మాజీ ఎంపీపీ కూన ప్రమీల సభ దృష్టికి తీసుకువచ్చారు. విద్యావ్యవస్థ చాలా బాగుందని ఎంఈవో రామరాజు చెప్పగా.. విద్యార్థుల సంఖ్య  ఎందుకు తగ్గుతుందని ప్రమీల ఎంఈవోను ప్రశ్నించారు. కింతలిలో నిబం ధనల ప్రకారం ఉపాధి పనులు కల్పించకపోవడంపై సర్పంచ్‌ ప్రసాద్‌, ఎంపీటీసీ హనుమంతురావు ఏపీవోను నిలదీశారు. పెరిగిన ధరల నేపథ్యంలో చెంత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు ఎలా పూర్తి చేయాలని తుంగపేట సర్పంచ్‌ వేణుగోపాలరావు అధికారులను ప్రశ్నించారు. పొందూరు ప్రభుత్వాసు పత్రి నుంచి వైద్యులు సమావేశానికి ఎందుకు హాజ రు కావడం లేదని ఎంపీటీసీ బి.హారిక ప్రశ్నించారు. అధికారులందరూ ఇకపై హాజరయ్యేలా చర్యలు తీసు కుంటామని ఎంపీడీవో చెప్పారు. సమస్యలపై వైసీపీ ఎంపీటీసీలు అధికారులను ప్రశ్నించారు.  తహసీల్దార్‌ గణపతిరావు, వైస్‌ ఎంపీపీలు చల్లమాంబ, శ్రీదేవి, కొంచాడ రమణమూర్తి, బి.సునీల్‌  పాల్గొన్నారు.

Updated Date - 2022-10-07T05:48:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising