ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దొంగ ఓట్లకు చెక్‌!

ABN, First Publish Date - 2022-07-29T05:49:23+05:30

ఓటుకు ఆధార్‌ నంబరును అనుసంధానం చేయనున్నారు. ఆగస్టు 4 నుంచి ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి బీఎల్‌వోలకు బాధ్యతలు అప్పగిస్తూ ఎలక్షన్‌ కమిషన్‌ ఆదేశాలు జారీచేసింది. వచ్చే ఏడాది మార్చి 31లోగా పూర్తిచేయాలని స్పష్టం చేసింది. క్షేత్రస్థాయిలో బూత్‌లెవల్‌ ఆఫీసర్లు ఇంటింటికీ వెళ్లి ఆఽధార్‌తో ఓటరుకార్డు అనుసంధానం చేయనున్నారు. ఆన్‌లైన్‌లో కూడా పూర్తిచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఫారం-6బీ ద్వారా ఆధార్‌ లింకైన వెంటనే మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. అది నమోదు చేయగానే అథంటికేషన్‌ ద్వారా అనుసంధానించవచ్చు. ఎన్నికల్లో దొంగ ఓట్లు, ఒకే వ్యక్తికి రెండుచోట్ల ఓట్లు ఉండడం వంటి వాటికి చెక్‌ చెప్పేందుకు ఆధార్‌ అనుసంధాన ప్రక్రియను తెరపైకి తెచ్చారు. పారదర్శకం కోసమే విధానాన్ని ప్రవేశపెట్టినట్టు ఎన్నికల కమిషన్‌ స్పష్టం చేశారు. జిల్లాలో ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం, శ్రీకాకుళం, ఆమదాల వలస, ఎచ్చెర్ల, నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటి పరిధిలో 2,342 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. 18 లక్షల 66

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆగస్టు 4 నుంచి ఓటుకు ఆధార్‌ అనుసంధానం

 వచ్చే ఏడాది మార్చి 31 వరకూ కొనసాగనున్న ప్రక్రియ

(టెక్కలి)

ఓటుకు ఆధార్‌ నంబరును అనుసంధానం చేయనున్నారు. ఆగస్టు 4 నుంచి ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి బీఎల్‌వోలకు బాధ్యతలు అప్పగిస్తూ ఎలక్షన్‌ కమిషన్‌ ఆదేశాలు జారీచేసింది. వచ్చే ఏడాది మార్చి 31లోగా పూర్తిచేయాలని స్పష్టం చేసింది. క్షేత్రస్థాయిలో బూత్‌లెవల్‌ ఆఫీసర్లు ఇంటింటికీ వెళ్లి ఆఽధార్‌తో ఓటరుకార్డు అనుసంధానం చేయనున్నారు. ఆన్‌లైన్‌లో కూడా పూర్తిచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఫారం-6బీ ద్వారా ఆధార్‌ లింకైన వెంటనే మొబైల్‌కు ఓటీపీ వస్తుంది.  అది నమోదు చేయగానే అథంటికేషన్‌ ద్వారా అనుసంధానించవచ్చు. ఎన్నికల్లో దొంగ ఓట్లు, ఒకే వ్యక్తికి రెండుచోట్ల ఓట్లు ఉండడం వంటి వాటికి చెక్‌ చెప్పేందుకు ఆధార్‌ అనుసంధాన ప్రక్రియను తెరపైకి తెచ్చారు. పారదర్శకం కోసమే విధానాన్ని ప్రవేశపెట్టినట్టు ఎన్నికల కమిషన్‌ స్పష్టం చేశారు.  జిల్లాలో ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం, శ్రీకాకుళం, ఆమదాల వలస, ఎచ్చెర్ల, నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటి పరిధిలో 2,342 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి.  18 లక్షల 66 వేల 694మంది ఓటర్లు ఉన్నట్లు జిల్లా ఎన్నికల యంత్రాంగం గుర్తించింది. ఇందులో 9 లక్షల 22 వేల737 మంది పురుషులు, 9 లక్షల 27వేల 698 మంది మహిళా ఓటర్లు, 233 మంది ఇతర ఓటర్లు, 60 మంది ఎన్‌ఆర్‌ఐలు, 15,966 మంది సర్వీస్‌ ఓటర్లు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. నియోజకవ ర్గాల వారీగా పరిశీలిస్తే ఇచ్ఛాపురం నియోజకవర్గంలో 2 లక్షల 61 వేల 724 మంది ఓటర్లు, పలాస నియోజకవర్గంలో 2 లక్షల 18 వేల 292 మంది ఓటర్లు, టెక్కలి నియోజ కవర్గంలో 2 లక్షల 37 వేల 904 మంది ఓటర్లు, పాతపట్నం నియోజక వర్గంలో 2 లక్షల 27 వేల 427 మంది ఓటర్లు, శ్రీకాకుళం నియోజకవర్గంలో 2 లక్షల 68 వేల 800మంది ఓటర్లు, ఆమదాలవలస నియోజకవర్గంలో లక్షా 97 వేల 747 మంది ఓటర్లు, ఎచ్చెర్ల నియోజకవర్గ పరిధిలో 2 లక్షల 39 వేల 274 మంది ఓటర్లు, నరసన్నపేట నియోజకవర్గంలో 2 లక్షల 15వేల 526 మంది ఓటర్లు ఉన్నారు. వీరందరికీ ఆగస్టు1 నుంచి 2023 మార్చి 31 వరకు ఆధార్‌ అనుసంధానం జరగనుంది. 


Updated Date - 2022-07-29T05:49:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising