ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి చక్రపెరుమాళ్‌ డోలోత్సవాలు

ABN, First Publish Date - 2022-03-05T05:56:06+05:30

నేటి నుంచి చక్రపెరుమాళ్‌ డోలోత్సవాలు

చక్రపెరుమాళ్‌ ఆలయం, (ఇన్‌సెట్లో) స్వామివారు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- అధిక సంఖ్యలో హాజరు కానున్న భ క్తులు 

- ఏర్పాట్లు పూర్తి

కవిటి : బెజ్జిపుట్టుగలో వెలసిన చక్రపెరుమాళ్‌ స్వామి డోలోత్సవాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలు 15 రోజుల పాటు వైభవంగా నిర్వ హించనున్నారు. ఈ నెల 19న ఉత్సవాలు ముగియనున్నాయి. సుమారు మూడు శతాబ్దాల కిందట బ్రిటిష్‌వారి పాలనలో తూర్పు తీరమైన బంగాళాఖాతంలో డచ్‌వారు ప్రయాణించే నౌకా బెజ్జిపుట్టుగ గ్రామ సమీపంలో హఠాత్తుగా నిలిచిపోయింది. ఈ విషయం తెలుసుకున్న బెజ్జిపుట్టుగ గ్రామస్థులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. నౌకలో శ్రీదేవి, భూదేవి సమేత చక్రధర స్వామివారి పంచలోహ విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాలను బయటకు తీసి గ్రామంలోని ఓ పురిపాకలో కళింగ వైష్ణవులు ప్రతిష్ఠించారు. ఆ వెంటనే నౌక ముందుకు కదిలినట్టు స్థానికులు చెబుతుంటారు. అలా వెలసిన స్వామివారిని బెజ్జిపుట్టుగకు చెందిన ఈనాందారులైన ఇచ్ఛాపురం వాసి గాదె దంపతులు తన స్వగృహానికి తీసుకువెళ్లి వైష్ణవ సంప్రదాయం ప్రకారం భోగరాగాలు నిర్వహిస్తుండగా ఇల్లంతా రక్తవర్ణం, వారు తిన్న తిండి కూడా రక్త వర్ణంగా మారిపోయింది. దాంతో భయబ్రాంతులైన పంతులుగారు మేము స్వామివారిని భోగరాగాలు నిర్వహించలేమని మరల బెజ్జిపుట్టుగలోనే విడిచివెళ్లారు. 


రాతితో ఆలయ నిర్మాణం

స్వామివారిని వంశపారంపర్య ధర్మకర్తలైన దివంగత రాజయోగి పొందల రామస్వామి నాయుడు ఈ విగ్రహాలను పునః ప్రతిష్ఠ చేశారు. అనంతరం ఆయన కుమారులు కృష్ణమనాయుడు ఆలయ నిర్మాణం చేసి విగ్రహాల ప్రతిష్ఠ జరిపించారు. వివిధ శిల్పాలు రాతిపై చెక్కించి గర్భగుడి నుంచి గరుడ స్తంభం వరకు ఆలయ నిర్మాణం చేశారు. అనంతరం ఆలయ ముందు భాగం మండపాన్ని దివంగత మాదిన సింహాద్రి ఆధ్వర్యంలో 1955లో నిర్మాణం పూర్తి చేసుకొని చక్రపెరుమాళ్‌ స్వామి ఆలయం పుణ్యక్షేత్రంగా వెలసింది. అప్పటి నుంచి ఏటా స్వామివారి డోలోత్సవాలు నిర్వహిస్తున్నారు.

Updated Date - 2022-03-05T05:56:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising