ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆదిత్యాలయం చుట్టూ సీసీ కెమెరాలు

ABN, First Publish Date - 2022-06-29T06:01:37+05:30

ఆదిత్యుని ఆల యంతో పాటు పరిసర ప్రాంతా ల్లో సీసీ కెమెరాల ను అమర్చాలని, అణువణువూ సీసీ కెమెరాల సర్వేలన్స్‌లో ఉం డాలని విజయ వాడ ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ డీఎస్పీ సి.రాజారెడ్డి ఆదేశించారు.

మాట్లాడుతున్న డీఎస్పీ రాజారెడ్డి:
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ డీఎస్పీ రాజారెడ్డి

అరసవల్లి: ఆదిత్యుని ఆల యంతో పాటు పరిసర ప్రాంతా ల్లో సీసీ కెమెరాల ను అమర్చాలని,     అణువణువూ సీసీ కెమెరాల సర్వేలన్స్‌లో ఉం డాలని  విజయ వాడ ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ డీఎస్పీ సి.రాజారెడ్డి ఆదేశించారు. ఆలయ భద్రతపై వివిధ శాఖల అధికారులతో ఆయన మంగళవారం సమీక్ష  నిర్వహిం చారు. ముందుగా జనరేటర్‌ రూమ్‌, కేశఖండనశాల, ఇంద్రపుష్కరిణి, సూర్యన మస్కారాల మండపం, అన్నదాన మండపం, స్వామివారి మాడవీధులు, ఉత్తర ద్వార దర్శన మార్గంను అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేవాలయ సెక్యూరిటీ సిబ్బంది తరచూ మాక్‌డ్రిల్స్‌ నిర్వహించాలన్నారు. మాడవీధుల్లో రాత్రి వేళ పటిష్ట భద్రత ఉండాలన్నారు. ఆలయ ప్రాంగణంలో అగ్నిమాపక పరికరాలను ఉంచాల న్నారు. తొలుత ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు స్వాగతం పలికి వేదమంత్రాలతో ఆశీర్వదించారు. ఈవో హరిసూర్యప్రకాష్‌ స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. కార్యక్రమంలో జిల్లా డీఎస్పీ మహేంద్ర, వన్‌ టౌన్‌ సీఐ అంబేడ్కర్‌, ఎస్‌ఐ ప్రవల్లిక, డీఎఫ్‌వో వరప్రసాదరావు, ఎచ్చెర్ల ఆర్‌ఐ ప్రదీప్‌, ఎలక్ట్రికల్‌ ఏఈ కమలహాసన్‌ తదితరులు పాల్గొన్నారు.





Updated Date - 2022-06-29T06:01:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising