ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేతనాలివ్వనిదే పనిచేయలేం..

ABN, First Publish Date - 2022-01-04T04:54:27+05:30

సంతకవిటి మండలం జావాం, రేగిడి మండలం బొడ్డవలస సమగ్ర రక్షిత నీటి పథకాల్లో పనిచేస్తున్న పంప్‌ ఆపరేటర్లకు 22 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో మూడు రోజులు గా నీటి విడుదలను నిలిపివేశారు. దీంతో రాజాం, రేగిడి, సంతకవిటి మండలాల్లోని 107 గ్రామాల్లో తాగునీటి సరఫరా నిలిచిపోయింది. బకాయిలు చెల్లించే వరకు విధుల్లో చేరేది లేదని వారు స్పష్టం చేశారు.

నినాదాలు చేస్తున్న పంప్‌ ఆపరేటర్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డీఈ, కాంట్రాకర్ల సమక్షంలో పంప్‌ ఆపరేటర్ల చర్చలు విఫలం

రాజాం, (సంతకవిటి), జనవరి 3: సంతకవిటి మండలం జావాం, రేగిడి మండలం బొడ్డవలస సమగ్ర రక్షిత  నీటి పథకాల్లో పనిచేస్తున్న పంప్‌ ఆపరేటర్లకు 22 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో మూడు రోజులు గా నీటి విడుదలను నిలిపివేశారు. దీంతో రాజాం, రేగిడి, సంతకవిటి మండలాల్లోని 107 గ్రామాల్లో తాగునీటి సరఫరా నిలిచిపోయింది. బకాయిలు చెల్లించే వరకు విధుల్లో చేరేది లేదని వారు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం జావాంలో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం వేతన బకాయిలు చెల్లించే పరిస్థితి లేనందున తానే 2 నెలల వేతనాలు చెల్లిస్తానని, మార్చి వరకు సహకరించాలని కాంట్రాక్టర్‌ ఆదినారాయణ కోరారు. దీనికి వారు అంగీకరించలేదు. 22 నెలలుగా వేతనాలు లేక అప్పులు వాడుకొని అడుక్కునే స్థితిలో మీ గౌరవం కోసం మా ఉద్యోగ రక్షణ కోసం పనిచేస్తున్నామని, అయినా అధికారులు పట్టించుకోవడం లేదని వారు పేర్కొన్నారు. ఇకపై తాము పని చేయలేమని, మా వేతన బకాయిలు చెల్లించి మమ్ములను తొలగించి కొత్తవారిని నియమించుకోవాలని వారు తేల్చి చెప్పారు. అనంతరం నీటి పథకం వద్ద నినాదాలు చేశారు. చర్చల్లో ఆర్‌డబ్యూఎస్‌ డీఈ వైకుంఠంనాయుడు, జేఈ సంతోష్‌కుమార్‌, సబ్‌ కాంట్రాక్టర్‌ కురిటి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

 

Updated Date - 2022-01-04T04:54:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising