ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధాన్యం కొనుగోలు చేయండి: జేసీ

ABN, First Publish Date - 2022-12-13T23:48:38+05:30

ఆర్బీకేల్లోని కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని జేసీ ఎం.నవీన్‌కుమార్‌ ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆమదాలవలస: ఆర్బీకేల్లోని కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని జేసీ ఎం.నవీన్‌కుమార్‌ ఆదేశించారు. మంగళవారం మండలంలోని సైలాడ రైతు భరోసా కేంద్రం, పురపాలక సంఘం పరిధిలోని మోనంగివీధి వార్డు సచివాలయం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం పట్టణంలోని మోనంగివీధి సచివాలయాన్ని సందర్శించారు. చింతాడ సంత మైదానం, మెట్టక్కివలస ప్రాంతం సర్వేనెంబర్‌ 196/12లో మంచినీటి ట్యాంకు నిర్మాణానికి స్థలం కేటాయించాలని పురపాలక సంఘం అధికారులు జేసీని కోరారు. దీంతో స్థలాన్ని పరిశీలించి 12 సెంట్లు చొప్పున కేటాయించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. మునిసిపల్‌ కమిషనర్‌ ఎం.రవిసుధాకర్‌, పబ్లిక్‌ హెల్త్‌ ఈఈ సుగుణాకరరావు, ఏవో మెట్ట మోహనరావు, డీటీ ఎస్‌.రాంబాబు, సీఎస్‌ డీటీ డి.అమర్‌నాథ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-13T23:48:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising