బురదలో బస్సు.. విద్యార్థుల బేజారు
ABN, First Publish Date - 2022-10-18T04:48:12+05:30
బురదలో బస్సు.. విద్యార్థుల బేజారు
బురదలో దిగిబడి పోయిన ఆర్టీసీ బస్సు
ఆమదాలవలస: ఆమదాలవలసలో విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధానికి మద్దతుగా వైసీపీ నాయకులు ఏర్పాటుచేసిన ర్యాలీకి బస్సుల్లో పలు విద్యాసంస్థల నుంచి విద్యార్థులను తరలించారు. ఈ క్రమంలో బూర్జ మండలం ఓవీ పేట నుంచి 40 మంది విద్యార్థులను తీసుకొచ్చిన ఆర్టీసీ బస్సు కళాశాల మైదానంలో కూరుకు పోయింది. దీంతో విద్యార్థులు ఇబ్బందిపడ్డారు. కళాశాల తరగతులు నిర్వహిస్తున్న సమయంలో సమావేశం ఏర్పాటు చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బి.శ్యామలరావు కూడా పాల్గొనడం విశేషం. స్పీకర్ తమ్మినేని సీతారాం, తమ్మినేని వెంకట చిరంజీవి నాగ్ పాల్గొన్నారు.
Updated Date - 2022-10-18T04:48:12+05:30 IST