ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెట్రోల్‌ బంకుకు బురిడీ

ABN, First Publish Date - 2022-12-16T23:31:31+05:30

టెక్కలిలో ఓ యువకుడు పెట్రోల్‌ బంకు సిబ్బందిని బురిడీ కొట్టించాడు. కొంతమంది ట్రాక్టర్ల డ్రైవర్ల వద్ద ముందుగా డబ్బులు వసూలు చేసి.. 2,600 లీటర్ల డీజిల్‌ కొట్టించాడు. వాటికి సంబంధించి డబ్బులు ఇవ్వకుండా పరారయ్యాడు. దీంతో లబోదిబోమంటూ సిబ్బంది, బంకు మేనేజర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

టెక్కలి పెట్రోల్‌బంకులో సీసీ ఫుటేజ్‌ పరిశీలించగా గుర్తించిన వ్యక్తి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- 2,600 లీటర్ల డీజిల్‌ కొట్టించి.. పరారైన యువకుడు

- లబోదిబోమంటూ సిబ్బంది ఫిర్యాదు

టెక్కలి, డిసెంబరు 16: టెక్కలిలో ఓ యువకుడు పెట్రోల్‌ బంకు సిబ్బందిని బురిడీ కొట్టించాడు. కొంతమంది ట్రాక్టర్ల డ్రైవర్ల వద్ద ముందుగా డబ్బులు వసూలు చేసి.. 2,600 లీటర్ల డీజిల్‌ కొట్టించాడు. వాటికి సంబంధించి డబ్బులు ఇవ్వకుండా పరారయ్యాడు. దీంతో లబోదిబోమంటూ సిబ్బంది, బంకు మేనేజర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. ‘నేను పంచాయతీరాజ్‌ విభాగంలో కాంట్రాక్టర్‌ను. కోటబొమ్మాళి నుంచి పూండీ వరకు చిప్స్‌తో వాహనాలను పంపించాలి. నా దగ్గర భారత పెట్రోలియం కార్డు ఉంద’ని ఓ యువకుడు టెక్కలిలోని భారత్‌ పెట్రోలియం బంక్‌ సిబ్బందికి నమ్మించాడు. తమ ట్రాక్టర్లు వస్తాయని డీజిల్‌ కొడితే.. బిల్లు ఇచ్చేస్తానని చెప్పాడు. మరోవైపు ముందుగా కొంతమంది ట్రాక్టర్‌ డ్రైవర్లను, యజమానులను గుర్తించి 65 రూపాయలకే ఒక లీటరు డీజిల్‌ వేయిస్తానని చెప్పాడు. ‘మీరు వచ్చి భారత్‌ పెట్రోల్‌బంకులో డీజిల్‌ కొట్టించుకోండి. నేను అక్కడే ఉంటా. నా దగ్గర బీపీ పెట్రోకార్డు ఉంది. నాకు నగదు అవసరం. అందుకే ఒక లీటరు డీజిల్‌ రూ.30 తక్కువగా మీకు ఇస్తున్నాను. ఈ విషయం బంకు దగ్గర ఎక్కడా ప్రస్తావించొద్దు’ అని ట్రాక్టర్‌ డ్రైవర్లు, యజమానులను కూడా నమ్మించాడు. పథకం ప్రకారం గురువారం రాత్రి 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు టెక్కలిలోని భారత్‌ పెట్రోలియం బంక్‌ వద్ద ఆ యువకుడు దగ్గరుండి ట్రాక్టర్లకు డీజిల్‌ కొట్టించి హడావుడి చేశాడు. వారి నుంచి ముందుగానే డబ్బులు వసూలు చేసి.. సుమారు 2,600 లీటర్ల డీజిల్‌ను కొట్టించాడు. డీజిల్‌ కొట్టిన తర్వాత ఒక్కో ట్రాక్టర్‌ వెళ్లిపోయాయి. చివరి ట్రాక్టర్‌కు డీజిల్‌ కొడుతున్న సమయంలో ఆ యువకుడు నెమ్మదిగా అక్కడి నుంచి తప్పించుకున్నాడు. వాహనాలకు డీజిల్‌ కొట్టడం పూర్తయిందని.. ఆ యువకుడి నుంచి బిల్లు తీసుకుందామని బంకు సిబ్బంది చూడగా ఎక్కడా కనబడకపోవడంతో లబోదిబోమన్నారు. బంకు మేనేజర్‌ సీతారాంకు విషయాన్ని తెలియజేశారు. ఉడాయించిన యువకుడు ఎవరా? అని సీసీ ఫుటేజుల్లో వెతికినా గుర్తించలేకపోయారు. దీనిపై ఎస్‌ఐ రామకృష్ణకు బంకు మేనేజర్‌ సీతారాం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు.

Updated Date - 2022-12-16T23:31:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising