ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bopparaju: క్షేత్రస్థాయిలో ఉద్యోగులు ఒత్తిడికి గురవుతున్నారు..

ABN, First Publish Date - 2022-09-26T20:10:57+05:30

100 ఏళ్ల క్రితం భూమి రీ సర్వే జరిగిందని ఏపీ జేఏసీ చైర్మైన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం (Srikakulam): 100 ఏళ్ల క్రితం భూమి రీ సర్వే (Land Re Survey) జరిగిందని ఏపీ జేఏసీ చైర్మైన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు (Bopparaju Venkateswarlu) అన్నారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ సుదీర్ఘ కాలం తర్వాత రీ సర్వే మొదలుపెట్టడాన్ని రెవెన్యూ ఉద్యోగులుగా స్వాగతిస్తున్నామన్నారు. కానీ భూ సర్వేకు సరిపడ సమయం సిబ్బందికి ఇవ్వటం లేదని, క్షేత్రస్థాయిలో ఉద్యోగులు ఒత్తిడికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గందరగోళంగా రీ సర్వే చేస్తే తప్పులు జరిగే ప్రమాదం ఉందన్నారు. 100 రోజుల్లో ఒక గ్రామంలో రీ సర్వే చేయాలని గడువు పెట్టి 75 రోజులకు కుదించారన్నారు. రైతు వివరాలు ఒక్కసారి తప్పుగా నమోదు అయితే మార్చుకునే అవకాశం ఉండదన్నారు. పైగా రీ సర్వేకి నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు. టార్గెట్స్ పెట్టి క్షేత్రస్థాయిలో సిబ్బందిని ఇబ్బందులకు గురిచేయవద్దని బొప్పరాజు విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2022-09-26T20:10:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising