ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏం ఉద్ధరించారని బీసీ గర్జన ?

ABN, First Publish Date - 2022-12-07T23:59:46+05:30

వైసీపీ మూడున్నరేళ్ల పాలనలో బీసీలకు ఏమి ఉద్ధరించారని బీసీ గర్జన నిర్వహిస్తున్నారని టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు చౌద రి నారాయణమూర్తి (బాబ్జీ), జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ చౌదరి ధనలక్ష్మి ప్రశ్నించారు. ఎస్‌ఎంపురంలోని తన స్వగృ హంలో బుధవారం వారు విలేకరులతో మాట్లాడారు.

మాట్లాడుతున్న నారాయణమూర్తి, ధనలక్ష్మి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎచ్చెర్ల, డిసెంబరు 7: వైసీపీ మూడున్నరేళ్ల పాలనలో బీసీలకు ఏమి ఉద్ధరించారని బీసీ గర్జన నిర్వహిస్తున్నారని టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు చౌద రి నారాయణమూర్తి (బాబ్జీ), జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ చౌదరి ధనలక్ష్మి ప్రశ్నించారు. ఎస్‌ఎంపురంలోని తన స్వగృ హంలో బుధవారం వారు విలేకరులతో మాట్లాడారు. కీలక పదవులన్నీ సీఎం తన సొంత సామాజిక వర్గానికే కట్టబెట్టారని విమర్శించారు. సామాజిక వర్గాల వారీగా ఏర్పాటు చేసిన కార్పొరేషన్‌లకు కనీస నిధులు కేటాయించలేదన్నారు. జగన్‌ పాలనలో బీసీ కులాలకు పూర్తిగా అన్యాయం జరిగిందన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో బీసీలకు, చేతి వృత్తిపనివారికి చంద్రబాబు ఆదరణ పథకాన్ని అమలు చేశారని గుర్తు చేశారు. కులాల వారీగా, ప్రాంతాల వారీగా చిచ్చుపెట్టే వైసీపీ పాలకులను రానున్న ఎన్నికల్లో చిత్తుగా ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. టీడీపీ ఆవిర్భావంతోనే బీసీలకు అన్ని విధాలా సముచిత స్థానం లభించిందన్నారు. బీసీ నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తున్న వైసీపీ సర్కారుకు బీసీల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ చౌదరి అవినాష్‌, మాజీ ఎంపీటీసీ గొంటి నర్సింగరావు, పీఏసీఎస్‌ మాజీ అధ్యక్షుడు సంపతిరావు గణపతిరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T23:59:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising