ఆటో డ్రైవర్ నిజాయితీ
ABN, First Publish Date - 2022-03-05T05:51:50+05:30
ఆటో డ్రైవర్ నిజాయితీ
బాధితుడికి పర్సు అందిస్తున్నడ్రైవర్ కృష్ణ
ఇచ్ఛాపురం : ఆటో డ్రైవర్ తన నిజాయితీని చాటుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే... ఇచ్ఛాపురం నుంచి బోర్డర్ వైపు వెళ్తున్న ఎ.నారాయణ తన పర్స్ పోగొట్టుకున్నారు. కొంత సమయం తర్వాత పర్సు పోయిందని తెలుసుకొని అదే దారిన వెతుకుతూ వచ్చాడు. అదే మార్గంలో ఆటోతో వస్తున్న డ్రైవర్ కృష్ణకి సంతోషిమాత ఆలయం వద్ద పర్సు దొరికింది. దాన్ని తీసుకొని ఆటో స్టాండ్ వచ్చి తోటి డ్రైవర్ల సమక్షంలో పరిశీలించారు. అందులో డబ్బులతో పాటు విలువైన పత్రాలు, ఫోన్ నెంబర్‌ను గుర్తించారు. వెంటనే బాధితుడికి ఫోన్ చేసి రప్పించి పర్సును అందించాడు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ కృష్ణను అందరూ అభినందించారు. కార్యక్రమంలో ఆటో యూనియన్ సభ్యులు దక్కత లింగరాజురెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-03-05T05:51:50+05:30 IST