ఆదిత్యుడి తలనీలాల వేలం ఖరారు
ABN, First Publish Date - 2022-12-15T23:06:23+05:30
అరసవల్లి సూర్యనారాయణ స్వామికి భక్తులు సమర్పించే తలనీలాలకు సంబంధించి గురువారం వేలం పాట నిర్వహించారు.
రూ.91లక్షలకు దక్కించుకున్న పాటదారుడు
శ్రీకాకుళం, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): అరసవల్లి సూర్యనారాయణ స్వామికి భక్తులు సమర్పించే తలనీలాలకు సంబంధించి గురువారం వేలం పాట నిర్వహించారు. 2023 జనవరి 3 నుంచి 2024 జనవరి 2 వరకు తలనీలాల సేకరణకుగాను రూ.91లక్షలకు వేలం ఖరారైంది. ఇతర జిల్లాకు చెందిన నలుగురు ఈ వేలంలో పాల్గొన్నారు. జై ఎంటర్ ప్రైజస్‌కు చెందిన వ్యక్తి రూ.91లక్షలకు వేలం పాడారు. గతేడాది రూ.90లక్షలు కాగా ఈ ఏడాది ఒక రూ.లక్ష ఆదాయం పెరిగింది. ఈవో సూర్యప్రకాష్, ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ, దేవదాయశాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల అసోసియేషన్(ఏపీజీఈఏ) రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ గురువారం సూర్యభగవానుడ్ని దర్శించుకున్నారు. ఆయనను అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు.
Updated Date - 2022-12-15T23:06:25+05:30 IST