ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆదిత్యుని సన్నిధిలో ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ

ABN, First Publish Date - 2022-12-16T23:19:39+05:30

అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారిని శుక్రవారం ఏపీ ట్రాన్స్‌కో చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ బి.శ్రీధర్‌ దర్శించుకున్నారు.

అరసవల్లి: జ్ఞాపిక అందిస్తున్న ఆలయ ఈవో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారిని శుక్రవారం ఏపీ ట్రాన్స్‌కో చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ బి.శ్రీధర్‌ దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేయించారు. స్వామివారి జ్ఞాపికను ఆలయ ఈవో హరిసూర్యప్రకాష్‌ వారికి అందజేశారు. కార్యక్రమంలో ఏపీ ట్రాన్స్‌కో అండ్‌ గ్రిడ్‌ డైరెక్టర్‌ భాస్కర్‌, ఏఈ కమలాసన్‌, ఆలయ సూపరింటెండెంట్‌ కె.వెంకటేశ్వరరావు, జూనియర్‌ అసిస్టెంట్‌ బీఎస్‌ చక్రవర్తి, తదితరులు పాల్గొన్నారు.

కూర్మనాథుడి దర్శనం..

గార: శ్రీకూర్మంలో కూర్మనాథుడుని శుక్రవారం ట్రాన్స్‌కో సీఎండీ బి.శ్రీధర్‌ దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయ చరిత్రను వివరించారు. స్వామివారి ప్రసాదాన్ని, చిత్రపటాన్ని ఈవో గురునాథరావు, ట్రాస్ట్‌బోర్డు సభ్యులు డబ్బీరు శ్రీనివాసరావు వారికి అందజేశారు. ట్రాన్స్‌కో డైరెక్టర్‌ వెంకట్‌భాస్కర్‌, ఎస్‌ఈ దేవిప్రసాద్‌, డీఈఈ నాయుడు, ఏఈ పవన్‌కుమార్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-12-16T23:19:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising