ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడేళ్లలో ఆంధ్రా అప్పులపాలు

ABN, First Publish Date - 2022-05-25T06:00:47+05:30

వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో ఆంధ్రాను అధోగతి పట్టించి అప్పులు పాల్జేశారని మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి విమర్శించారు. చీడిపూడి గ్రామంలో మంగళవారం సాయంత్రం ‘బాదుడే బాదుడు’ కార్యక్రమం నిర్వహించారు.

టీడీపీలో చేరిన వారికి కండువా వేస్తున్న మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


 మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి

 టీడీపీలో చేరిన వైసీపీ నేతలు

సారవకోట (జలుమూరు), మే 24: వైసీపీ అధికారంలోకి వచ్చిన  మూడేళ్లలో ఆంధ్రాను అధోగతి పట్టించి అప్పులు పాల్జేశారని మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి విమర్శించారు. చీడిపూడి గ్రామంలో మంగళవారం సాయంత్రం ‘బాదుడే బాదుడు’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిత్యావసర వస్తువులపై ధరలు పెంచి ప్రజానీకం నడ్డి విరిచారన్నారు. వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి టీడీపీ బలోపేతానికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని కోరారు. అనంతరం గ్రామానికి చెందిన పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. వీరికి రమణ మూర్తి కండువాలను వేసి పార్టీలోకి ఆహ్వానిం చారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు కత్తిరి వెంకటరమణ, మాజీ మార్కెట్‌ కమిటీ అధ్యక్షుడు బైరి భాస్కరరావు, నాయకులు సురవరపు తిరుపతిరావు, ధర్మాన తేజకుమార్‌, బగ్గు గోవిందరావు, పొన్నాన శంకరరావు, పట్ట ఉమ, నాగరాజు, జయరాం తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2022-05-25T06:00:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising