ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అందరివాడు ఎర్రన్నాయుడు

ABN, First Publish Date - 2022-11-01T23:48:54+05:30

జిల్లా రాజకీయ యవనికపై ఎర్రన్నాయుడుది ప్రత్యేక స్థానం. రాజకీయ అరంగేట్రం చేసిన అనతికాలంలోనే జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగిన కొద్దిమందిలో ఎర్రన్న ఒకరు. సుదీర్ఘ కాలం శ్రీకాకుళం ఎంపీగా పదవీ బాధ్యతలు చేపట్టి.. కేంద్ర మంత్రిగా వ్యవహరించారు. మూడు దశాబ్దాల పాటు గెలుపోటములతో సంబంధం లేకుండా రాజకీయాల్లో రాణిం చారు. మారుమూల నిమ్మాడ నుంచి తన ప్రయాణం ప్రారంభించి రాష్ట్ర, జాతీయ రాజకీ యాల్లో తనదైన ముద్రవేశారు.

కింజరాపు ఎర్రన్నాయుడు (ఫైల్‌ ఫోటో)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మూడు దశాబ్దాల పాటు ప్రజాసేవలో పునీతం

నేడు 10వ వర్ధంతి

(టెక్కలి)

జిల్లా రాజకీయ యవనికపై ఎర్రన్నాయుడుది ప్రత్యేక స్థానం. రాజకీయ అరంగేట్రం చేసిన అనతికాలంలోనే జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగిన కొద్దిమందిలో ఎర్రన్న ఒకరు. సుదీర్ఘ కాలం శ్రీకాకుళం ఎంపీగా పదవీ బాధ్యతలు చేపట్టి.. కేంద్ర మంత్రిగా వ్యవహరించారు. మూడు దశాబ్దాల పాటు గెలుపోటములతో సంబంధం లేకుండా రాజకీయాల్లో రాణిం చారు. మారుమూల నిమ్మాడ నుంచి తన ప్రయాణం ప్రారంభించి రాష్ట్ర, జాతీయ రాజకీ యాల్లో తనదైన ముద్రవేశారు. జిల్లా కీర్తిని ఇనుమడింపజేశారు. తొలిసారిగా హరిశ్చం ద్రపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా వరుసగా గెలుపొందుతూ వచ్చారు. ప్రభుత్వ చీఫ్‌వీప్‌గా, నాలుగుసార్లు ఎంపీగా, కేంద్ర మంత్రిగా, రైల్వే, అగ్రికల్చర్‌ స్టాండింగ్‌ కమిటీలకు చైర్మన్‌గా, లోక్‌సభ ప్యానెల్‌ స్పీకర్‌గా, పార్లమెంట్‌ హౌస్‌లో ఫుడ్‌ కమిటీ ప్రతినిధిగా పదవులు చేపట్టారు. అటు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. పొలిట్‌బ్యూరో సభ్యుడితో పాటు పార్టీ పార్ల మెంటరీ నేతగా అరుదైన గౌరవం దక్కించుకున్నారు. రాజకీయ అరంగేట్రం నుంచి చని పోయే వరకూ టీడీపీలోనే కొనసాగారు. రాజకీయాలకు అతీతంగా వ్యవహరించే నాయ కుడిగా ఎర్రన్నకు పేరుంది. అన్ని రాజకీయపక్షాల్లో ఆయనకు స్నేహితులు, సన్నిహితులు ఉన్నారు. ప్రజలతో మమేకం కావడంతో ముందంజలో ఉండే వారు. జిల్లా అభివృద్ధికి విశేషంగా పాటుపడిన ఎర్రన్నాయుడు ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం పొందారం టే అతిశ యోక్తి కాదు. టీడీపీ నాయకుడిగా ప్రజలు, పార్టీ కార్యకర్తలతో ఆయనకు బల మైన సంబంధాలుండేవి. నిత్య కృషీ వలుడిగా పేరుపొందిన కింజరాపు ఎర్రన్నాయుడు 2012 నవంబరు 2న రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడడాన్ని జిల్లా వాసులు జీర్ణిం చుకోలేకపోయారు. ఆయనను శాశ్వతంగా తమ హృదయాల్లో దాచుకునేలా విగ్రహాలను ఏర్పాటు చేశారు. తాడేపల్లిగూడెంలో ఓ కార్యకర్త ఎర్రన్నాయుడుకు గుడికట్టాడంటే ఆయ నకు ప్రజలతో ఉన్న అనుబంధమే కారణం. ఆయన రాజకీయ వారసత్వాన్ని కుమారుడు రామ్మోహన్‌ నాయుడు స్వీకరిం చారు. ఎంపీగా తండ్రి బాటలో పయనిస్తూ వివిధ సమస్యలపై పార్లమెంట్‌లో తనగళాన్ని విని పిస్తూ తండ్రికి తగ్గ తనయునిగా పేరు పొందారు. ఎర్రన్నాయుడు సోదరుడు అచ్చెన్నాయుడు టెక్కలి ఎమ్మెల్యేగా ఉంటూ ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహ రిస్తున్నారు.

నేడు వర్ధంతి

ఎర్రన్నాయుడు 10వ వర్ధంతిని నిమ్మాడలోని ఎర్రన్నాయుడు ఘాట్‌ వద్ద బుధవారం నిర్వ హించనున్నారు. వేలాది మంది టీడీపీ నాయ కులు, కార్యకర్తలు, అభిమానులు నివాళులు అర్పించనున్నారు. అలాగే నిమ్మాడ జంక్షన్‌ వద్ద ఎర్రన్నాయుడు కాంస్య విగ్రహాన్ని ఆవిష్క రించనున్నారు.

Updated Date - 2022-11-01T23:48:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising