చెరువులో పడి మహిళ మృతి
ABN, First Publish Date - 2022-12-31T00:02:13+05:30
పెంట గ్రామానికి చెందిన గెడ్డాపు చిన్న మ్మడు (25) అనే మహిళ చెరువులో పడి మృతి చెందింది.
చిన్నమ్మడు (ఫైల్)
జి.సిగడాం: పెంట గ్రామానికి చెందిన గెడ్డాపు చిన్న మ్మడు (25) అనే మహిళ చెరువులో పడి మృతి చెందింది. చిన్నమ్మడుకు మతిస్థిమితం సరిగా ఉండదు. గురువారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి సాయంత్రానికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు వెతికారు. శుక్రవారం జి.సిగడాంలోని పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న చింతలబందలో ఆమె మృతదేహం కనిపించింది. దీనిపై ఆమె సోదరుడు త్రినాథరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్‌సీ పొగిరి శంకరరావు తెలిపారు.
Updated Date - 2022-12-31T00:02:14+05:30 IST