ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పడిపోతున్న వైసీపీ గ్రాఫ్‌

ABN, First Publish Date - 2022-11-16T23:46:57+05:30

రోజురోజుకూ వైసీపీ గ్రాఫ్‌ పడిపోతుందని, రానున్న ఎన్ని కలతో ఆ పార్టీకి నూకలు చెల్లినట్టేనని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకటరావు అన్నారు. బడివానిపేట, కొయ్యాం, తోటపాలెం గ్రామాల్లో బుధ వారం సాయంత్రం నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమంలో ఆయన పాల్గొని మా ట్లాడారు.

బడివానిపేటలో మాట్లాడుతున్న కళావెంకటరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎచ్చెర్ల, నవంబరు 16: రోజురోజుకూ వైసీపీ గ్రాఫ్‌ పడిపోతుందని, రానున్న ఎన్ని కలతో ఆ పార్టీకి నూకలు చెల్లినట్టేనని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకటరావు అన్నారు. బడివానిపేట, కొయ్యాం, తోటపాలెం గ్రామాల్లో బుధ వారం సాయంత్రం నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమంలో ఆయన పాల్గొని మా ట్లాడారు. ఒక్క ఛాన్స్‌ ఇవ్వాలని ప్రజలను వేడుకొని గద్దెనెక్కిన సీఎం జగన్మోహన్‌రెడ్డి అస్తవ్యస్త పాలన సాగిస్తున్నారని విమర్శించారు. మూడు రాజధానుల పేరు చెప్పి ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టించడం సరికాదన్నారు. విశాఖను దోచుకోవడానికే రాజధాని పేరిట నాటకామాడుతున్నారని చెప్పారు. ఇప్పటికే విశాఖలో భూ దందాలు, కబ్జాలు పెరిగిపోయాయన్నారు. ప్రశ్నించే ప్రతిపక్ష నేతలను అరెస్టులు చేయడం తప్ప ఈ మూడున్నరేళ్ల పాలనలో సాధించిదేమిటిని ప్రశ్నించారు. అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామని చెప్పిన సర్కారు దాన్ని గాలికొదిలేసిందన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలుపు తథ్యమని అన్నారు. రా ష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, నిరుద్యోగ సమస్య పరిష్కారం టీడీపీతోనే సాధ్యమన్నారు. కార్యక్ర మంలో పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు బెండు మల్లేశ్వరరావు, వావిలపల్లి రామకృష్ణ, నేతలు గాలి వెంకటరెడ్డి, అన్నెపు భువనేశ్వరరావు, గూరు జగపతి బాబు, బచ్చు కోటిరెడ్డి, పైడి అన్నంనాయుడు, సంధ్యా గజపతి తదితరులు పాల్గొన్నారు. ఫ స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న బడివానిపేట మాజీ సర్పంచ్‌ వారది ఎర్రయ్య టీడీపీలో చేరారు. ఆయనకు కళావెంకటరావు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.

Updated Date - 2022-11-16T23:46:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising