ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

968 బస్తాల రేషన్‌ బియ్యం స్వాధీనం

ABN, First Publish Date - 2022-01-24T04:57:15+05:30

మండలంలోని మెట్టూరు బిట్‌-1లో అక్రమంగా నిలు వ ఉంచిన రేషన్‌ బియ్యాన్ని విజిలెన్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం గ్రామానికి చెందిన పొడ్డిన ఉమకు చెందిన గొడౌన్‌లో అధికారులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆదివారం కూడా ఈ తనిఖీలు కొనసాగించారు.

బియ్యం బస్తాలను పరిశీలిస్తున్న విజిలెన్స్‌ అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రెండోరోజూ కొనసాగిన తనిఖీలు

కొత్తూరు: మండలంలోని మెట్టూరు బిట్‌-1లో అక్రమంగా నిలు వ ఉంచిన రేషన్‌ బియ్యాన్ని విజిలెన్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం గ్రామానికి చెందిన పొడ్డిన ఉమకు చెందిన గొడౌన్‌లో అధికారులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆదివారం కూడా ఈ తనిఖీలు కొనసాగించారు. ఈ సందర్భంగా 968 బస్తాల బియ్యం స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో బస్తాలో 50 కేజీల చొప్పున 40 టన్నుల బియ్యం అక్రమంగా నిలువ ఉంచినట్లు విచారణలో తేలిందని విజిలెన్స్‌ సీఐ బి.సింహాచలం, ఎస్‌ఐలు అశోక్‌ చక్రవర్తి, రామారావు తలిపారు. ఈ బియ్యం బస్తాలను భామిని ఎం ఎల్‌ఎస్‌ పాయింట్‌కు తరలించామన్నారు. పూర్తి స్థాయి విచారణకు మరో రెండు రోజులు సమయం పట్టే అవకాశం ఉందన్నారు. తనిఖీల్లో కానిస్టేబుళ్లు అప్పన్న, రామ్మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Updated Date - 2022-01-24T04:57:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising