ద్విచక్ర వాహనాల వేలం ద్వారా రూ.3.87లక్షలు
ABN, First Publish Date - 2022-12-07T23:17:12+05:30
మద్యం, సారా అక్రమంగా రవాణా చేస్తుండగా పలు కేసుల్లో స్వాధీనం చేసుకున్న 21 ద్విచక్ర వాహనాలను బుధవారం వేలం వేశారు. దీని ద్వారా రూ.3.87 లక్షలు ఆదాయం వచ్చినట్లు ఎస్‌ఈబీ అసిస్టెంట్ కమిషనర్ కేపీ గోపాల్ తెలిపారు.
నరసన్నపేట: మద్యం, సారా అక్రమంగా రవాణా చేస్తుండగా పలు కేసుల్లో స్వాధీనం చేసుకున్న 21 ద్విచక్ర వాహనాలను బుధవారం వేలం వేశారు. దీని ద్వారా రూ.3.87 లక్షలు ఆదాయం వచ్చినట్లు ఎస్‌ఈబీ అసిస్టెంట్ కమిషనర్ కేపీ గోపాల్ తెలిపారు. కార్యాలయం వద్ద ద్విచక్రవాహనాలను వేలం వేశారు. కార్యక్రమంలో సీఐ ఏఎస్ దొర, ఎస్‌ఐ జె.సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-07T23:17:14+05:30 IST