కాంగ్రెస్‌తోనే ప్రత్యేక హోదా: జేడీ శీలం
ABN, First Publish Date - 2022-10-17T10:12:08+05:30
రాష్ర్టానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, రాయలసీమకు బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఏఐసీసీ నాయకుడు,
ఎమ్మిగనూరు, అక్టోబరు 16: రాష్ర్టానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, రాయలసీమకు బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఏఐసీసీ నాయకుడు, మాజీ మంత్రి జేడీ శీలం అన్నారు. ఆదివారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కె.లక్షీనారాయణరెడ్డి స్వగృహంలో రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సమాజాన్ని ఏకం చేసేందుకే రాహుల్ గాంఽధీ భారత్ జోడో యాత్ర చేస్తున్నారన్నారు. గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ జోడో యాత్ర ఈ నెల 18న కర్ణాటక నుంచి కర్నూలు జిల్లాలోని హాలహార్వి మండలం మీదుగా రాష్ట్రంలోకి ప్రవేశిస్తుందని తెలిపారు.
Updated Date - 2022-10-17T10:12:08+05:30 IST