ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంగన్‌వాడీ బడిలో కలెక్టర్‌ కొడుకు

ABN, First Publish Date - 2022-06-04T09:40:11+05:30

ఆదర్శాలు అందరూ చెబుతుంటారు. వాటిని ఆచరణలో చూపించేవారు కొందరే ఉంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు(కలెక్టరేట్‌), జూన్‌ 3: ఆదర్శాలు అందరూ చెబుతుంటారు. వాటిని ఆచరణలో చూపించేవారు కొందరే ఉంటారు. వారిలో కర్నూలు జిల్లా కలెక్టర్‌ కోటేశ్వరరావు ఒకరు. కలెక్టర్‌ తన కుమారుడిని అంగన్‌వాడీ ప్రీ స్కూల్‌లో చేర్పించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. కలెక్టర్‌ కోటేశ్వరరావు, స్వర్ణలత దంపతులకు దివి అర్విన్‌(4) ఒక్కడే కుమారుడు. స్వర్ణలత తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లో పాలిటెక్నిక్‌ కళాశాలలో లెక్చరర్‌గా పని చేస్తున్నారు. వీరు తమ కుమారుడు ఆర్విన్‌ను బుధవారపేటలోని అంగన్‌వాడీ ప్రీ స్కూల్‌లో చేర్పించారు. అక్కడి పిల్లలతో కలిసి ఆర్విన్‌ బొమ్మలకు రంగులు దిద్దుకుంటూ, ఆట వస్తువులతో ఆడుకుంటూ సరదాగా కనిపించాడు. స్వతహాగా కలెక్టర్‌ కోటేశ్వరరావు ఆర్భాటాలకు దూరంగా ఉంటారు. కలెక్టర్‌ కుమారుడు తమ అంగన్‌వాడీలో చేరడం గర్వంగా ఉందని గ్రేడ్‌1 సూపర్‌వైజర్‌ వసంతమ్మ అన్నారు. అర్విన్‌ ఉదయం 10 గంటలకు స్కూల్‌కు వచ్చి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఉంటారని ఆమె తెలిపారు.

Updated Date - 2022-06-04T09:40:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising