ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Somu Virraju comments: అధీర్ రంజన్ చౌదరిపై కఠిన చర్యలు తీసుకోవాలి: సోము వీర్రాజు

ABN, First Publish Date - 2022-07-28T19:52:39+05:30

కాంగ్రెస్ లోక్ సభ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరిపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి (Amaravathi): కాంగ్రెస్ లోక్ సభ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి (Adhir Ranjan Chaudhary)పై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Virraju) మండిపడ్డారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్‌లో అధీర్ రంజన్ రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము (Draupati Murmu)ను అవమానించారని, అనుచిత వ్యాఖ్యలు చేస్తే  కాంగ్రెస్ పార్టీ (Congress party) నుంచి ఎందుకు బహిష్కరించలేదని ప్రశ్నించారు. ఇలాంటి చెడు మనస్తత్వం ఉన్న వ్యక్తిపై చట్టపరంగా కఠిన చర్యలు  తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక గిరిజన మహిళ దేశానికి రాష్ట్రపతి కావడం కాంగ్రెస్‌కు బాధ కలిగిస్తోందని, ఆదివాసీలంటే కాంగ్రెస్‌కు తిరస్కార భావమని అన్నారు. రాష్ట్రపతి పట్ల కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేయాలని పిలుపిచ్చారు. ఏపీ (AP)లో జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని సోము వీర్రాజు పేర్కొన్నారు.


కాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కాంగ్రెస్ లోక్ సభ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి ‘రాష్ట్రపత్ని’ అని సంబోధించారు. రాష్ట్రపతిని అధీర్ అవమానించారంటూ బీజేపీ ఎంపీలు పార్లమెంట్‌లో నిరసనకు దిగారు. ఆయన రాష్ట్రపతికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అటు రాజ్యసభలోనూ ఆందోళన చేపట్టారు. బీజేపీ నిరసనలతో ఉభయ సభలు అట్టుడికాయి. నిరసనల మధ్య రాజ్యసభ వాయిదా పడింది.

Updated Date - 2022-07-28T19:52:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising