ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Somireddy Tweet: ఒక్కో రాష్ట్రానికి ఒక్కో చట్టమా?.. కేంద్రాన్ని ప్రశ్నించిన సోమిరెడ్డి

ABN, First Publish Date - 2022-07-28T18:41:28+05:30

ఒక్కో రాష్ట్రానికి ఒక్కో చట్టమా? అంటూ టీడీపీ నేత సోమిరెడ్డి ట్విట్టర్ వేదికగా కేంద్రాన్ని ప్రశ్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి (Amaravathi): ఒక్కో రాష్ట్రానికి ఒక్కో చట్టమా? అంటూ టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy) ట్విట్టర్ (Twitter) వేదికగా కేంద్రాన్ని ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన 2031 వరకు సాధ్యం కాదని కేంద్రం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. విభజన చట్టం హామీల్లో పునర్విభజన ఉందనే విషయాన్ని కేంద్ర పెద్దలు గుర్తుంచుకోవాలన్నారు. కాశ్మీ‌ర్‌ (Kashmir)లో నియోజకవర్గాల పునర్విభజనకు అవసరంలేని చట్టసవరణ తెలుగు రాష్ట్రాలకే అవసరమైందా? అని ప్రశ్నించారు. ఒక్కో రాష్ట్రం విషయంలో ఒక్కోలా నిర్ణయం తీసుకోవడం కేంద్ర ప్రభుత్వానికి సరికాదన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న నియోజకవర్గాల పునర్విభజన హామీని వెంటనే నెరవేర్చాలని సోమిరెడ్డి ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు.

Updated Date - 2022-07-28T18:41:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising