ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్మగ్లింగ్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ ఇండియా ఘనత వైసీపీదే: బొండా

ABN, First Publish Date - 2022-12-07T02:59:30+05:30

‘‘ఉన్న రాజధాని అమరావతిని చంపేశారు. మూడు రాజధానులు ఎవరికీ కనిపించవు. కాని ఒక రాజధానిని మాత్రం వైసీపీ ప్రభుత్వం తెచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): ‘‘ఉన్న రాజధాని అమరావతిని చంపేశారు. మూడు రాజధానులు ఎవరికీ కనిపించవు. కాని ఒక రాజధానిని మాత్రం వైసీపీ ప్రభుత్వం తెచ్చింది. గంజాయి స్మగ్లింగ్‌లో రాష్ట్రాన్ని ఏకంగా దేశానికే రాజధానిగా నిలపగలిగారు. స్మగ్లింగ్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ ఇండియా అన్న ఘనతను సాధించారు’’ అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, బొండా ఉమామహేశ్వరరావు ఎద్దేవా చేశారు. మంగళవారం ఆయన ఇక్కడ తమ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘విశాఖ మన్యంలో పండిన గంజాయిని వైసీపీ నేతలే ఇతర రాష్ట్రాలకు స్మగ్లింగ్‌ చేస్తున్నారు. ఒక్క మన రాష్ట్రంలోనే పోలీసులకు 18 వేల కిలోల గంజాయి పట్టుబడింది. విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్రను గంజాయి డెన్‌గా మార్చారు’’ అని విమర్శించారు. కాగా, వైసీపీ నేతలపై ఐటీ దాడులు ఇంకా పెరుగుతాయని ఉమ వ్యాఖ్యానించారు. వైసీపీ నేతల అవినీతి, అక్రమాలపై తాము చేసిన ఫిర్యాదులపై ఏదో ఒక రోజు విచారణ ప్రారంభం కాక తప్పదన్నారు. సంకల్ప సిద్ధి పేరుతో రూ.వందల కోట్ల డిపాజిట్లు ప్రజల నుంచి అక్రమంగా సేకరించిన వ్యవహారంలో వైసీపీ ప్రముఖులు కొందరు ఇరుక్కోక తప్పదని బొండా ఉమ అభిప్రాయపడ్డారు.

Updated Date - 2022-12-07T02:59:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising