ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా వచ్చినా పర్లేదు అనుకుంటే మా ఇంటికి రండి: ఎమ్మెల్యే పద్మావతి

ABN, First Publish Date - 2022-01-19T21:04:26+05:30

తాను కనిపించడం లేదంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టర్‌పై శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి స్పందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: తాను కనిపించడం లేదంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టర్‌పై శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి స్పందించారు. ఏబీఎన్‌లో కథనాలు ప్రసారం కావడంతో ఎమ్మెల్యే అలర్ట్ అయ్యారు. బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇచ్చారు. తాను రెండు రోజులు కనిపించకపోతేనే తన నియోజకవర్గంలోని గుంజేపల్లి ప్రజలు తనను మిస్ అవుతున్నట్లు ఉన్నారని ఛలోక్తి విసిరారు. ఈ నెల 16న తన భర్త సాంబశివారెడ్డికి కోవిడ్ సోకిందని, కావున తామంతా క్వారంటైన్‌లో ఉన్నామని ఎమ్మెల్యే పద్మావతి వివరణ ఇచ్చారు. కరోనా వచ్చినా పర్లేదు అనుకుంటే తనను కలవడానికి ఇంటికి రావాలని గుంజేపల్లి గ్రామస్థులకు పిలుపునిచ్చారు. ఎవరి కులం వారికి గొప్పదని, గుంజేపల్లిలో కొందరు కులాన్ని పట్టుకుని వేలాడుతున్నారని చెప్పారు. ఎమ్మెల్యేగా రూల్ బుక్ ప్రకారమే తాను వెళ్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు. తాను కనిపించడం లేదంటూ వైరల్ చేస్తున్న పోస్టర్ వెనుక ఎవరు ఉన్నారో తనకు తెలియదని, వారి ఉద్దేశం ఏంటో అంతుపట్టడం లేదని చెప్పారు.


తన బావ కుమారుడి ప్రవర్తనతో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఇటీవల కూడా వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే భర్త సాంబశివారెడ్డి అన్న కుమారుడైన ఎర్రిస్వామి రెడ్డి ఇటీవల జరిగిన ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొని దర్పం ప్రదర్శించి విమర్శల పాలైన విషయం తెలిసిందే.

Updated Date - 2022-01-19T21:04:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising