అటకెక్కిన Siddeshwaram అలుగు ప్రాజెక్టు
ABN, First Publish Date - 2022-05-31T16:41:37+05:30
రాయలసీమ కరువు కాటకాలకు శాశ్వత పరిష్కారం చూపే సిద్దేశ్వరం అలుగు ప్రాజెక్టు అటకెక్కింది.
Amaravathi: రాయలసీమ కరువు కాటకాలకు శాశ్వత పరిష్కారం చూపే సిద్దేశ్వరం (Siddeshwaram) అలుగు ప్రాజెక్టు అటకెక్కింది. తాము అధికారంలోకి వస్తే సిద్దేశ్వరం అలుగు నిర్మిస్తామని హామీ ఇచ్చిన జగన్ (Jagan).. అధికారం చేపట్టి మూడేళ్లయినా దాని ఊసే లేదు. దీంతో సిద్ధేశ్వరం అలుగు సాధన కోసం రాయలసీమ సాగు నీటి సాధన సమితి, రైతులు సిద్దేశ్వరం వద్ద దీక్షకు సిద్ధమయ్యారు. గత టీడీపీ (TDP) ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతలు సిద్దేశ్వరం అలుగు ప్రాజెక్టు శంకుస్థాపనను మహోద్యమంలా తెరవెనుక ఉండి మద్దతిచ్చారు. అయితే అధికారంలోకి రాగానే ఉద్యమాన్ని పట్టించుకోవడంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సిద్దేశ్వరం అలుగు ప్రాజెక్టు రాయలసీమ వాసుల చిరకాల స్వప్నం. రాయలసీమ పోరాట చరిత్రలో సిద్దేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపనకు ప్రత్యేకత ఉంది. 2016 మే 31న వేలాది మంది సీమ రైతులు రాయలసీమ సాగునీటి సాధన సమితి ప్రతినిధులు కొత్తపల్లి మండలం, సిద్దేశ్వరం వద్ద కృష్ణానది ఒడ్డున సిద్దేశ్వరం అలుగు నిర్మాణానికి ప్రజా శంకుస్థాపన చేశారు. నంద్యాల ఉప ఎన్నికల సమయంలో 2019 ఎన్నికలకు ముందు తమ పార్టీ అధికారంలోకి వస్తే సిద్దేశ్వరం అలుగు ప్రాజెక్టును నిర్మిస్తామని జగన్ హామీ ఇచ్చారు. అయితే అధికారం చేపట్టి మూడేళ్లు అవుతున్నా.. సిద్దేశ్వరం అలుగు ప్రాజెక్టు నిర్మాణం విషయంలో సీఎం జగన్‌కు చిత్తశుద్ధి కరువైంది.
Updated Date - 2022-05-31T16:41:37+05:30 IST