రేషన్ డీలర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపండి
ABN, First Publish Date - 2022-12-07T03:02:14+05:30
రాష్ట్రవ్యాప్తంగా రేషన్ డీలర్ల జీవనోపాధికి ప్రత్యామ్నాయం చూపించాలని సీపీఎం నేత, మాజీ ఎంపీ పెనుమల్లి మధు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సీఎంకు సీపీఎం నేత మధు లేఖ
అమరావతి, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి) : రాష్ట్రవ్యాప్తంగా రేషన్ డీలర్ల జీవనోపాధికి ప్రత్యామ్నాయం చూపించాలని సీపీఎం నేత, మాజీ ఎంపీ పెనుమల్లి మధు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాశారు. ‘‘ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కేవలం బియ్యం మాత్రమే పంపిణీ చేస్తున్నారు. చివరికి ఖాళీ గోనెసంచులు కూడా లాగేసుకున్నారు. ఈ కారణాల వల్ల డీలర్ల ఉపాధి ప్రమాదంలో పడింది. వారితో చర్చించి తగిన చర్యలు చేపట్టాలని మధు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Updated Date - 2022-12-07T03:02:15+05:30 IST