ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సుప్రీంలో జగన్ ప్రభుత్వానికి షాక్..

ABN, First Publish Date - 2022-09-26T20:02:09+05:30

పోలవరం ప్రాజెక్టు (Polavaram Project)పై సుప్రీంకోర్టు (Supreme Court)లో జగన్ ప్రభుత్వా (Jagan Government)నికి షాక్ తగిలింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Delhi : పోలవరం ప్రాజెక్టు (Polavaram Project)పై సుప్రీంకోర్టు (Supreme Court)లో జగన్ ప్రభుత్వా (Jagan Government)నికి షాక్ తగిలింది. పర్యావరణానికి కలిగిన నష్టా (Environmental damage)నికి ఎందుకు బాధ్యత తీసుకోరని ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీం ప్రశ్నించింది. న్యాయవాదుల (Lawyers)కు ఫీజులు చెల్లించడానికి డబ్బు వెచ్చిస్తున్న ప్రభుత్వం పర్యావరణ నష్టాన్ని ఎందుకు భరించదని నిలదీసింది. పోలవరం ప్రాజెక్ట్ కేసు (Polavaram Project Case)లో ఇప్పటి వరకూ ఎంత డబ్బు న్యాయవాదులకు ఖర్చు పెట్టారనే దానిపై నోటీసు ఇస్తామని సుప్రీం పేర్కొంది. 


ఒక్క కేసుకు ఎంత మంది సీనియర్ న్యాయవాదుల (Senior Lawyers)ను ఎంగేజ్ చేస్తారని సుప్రీం ప్రశ్నించింది. ప్రభుత్వాలకు న్యాయవాదులను రంగంలో దించడంపై ఉన్న ఆసక్తి పర్యావరణ పరిరక్షణ పైన లేదని సుప్రీం వ్యాఖ్యానించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం (Polavaram Project construction)లో పర్యావరణ ఉల్లాంఘనలకు రూ.120 కోట్లు పర్యావరణ రుసుము (Environment Fee) చెల్లించాలన్న ఎన్జీటీ తీర్పు (NGT judgment)ను ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. జస్టిస్ అజయ్ రాస్తోగి బెంచ్ (Justice Ajay Rastogi bench) కేసు విచారణ జరిపింది. 


పోలవరం (Polavaram), పురుషోత్తపట్నం (Purushothapatnam), పులిచింతల ప్రాజెక్టుల (Pulichinthala Project)పై ఎన్జీటీ ఇచ్చిన తీర్పుపై దాఖలు చేసిన అప్పీళ్ళను కలిపి వింటామని సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది. ఇప్పటికీ ఇంకా ఉల్లాంఘనలు జరుగుతున్నాయని పిటిషనర్ డాక్టర్ పెంటపాటి పుల్లారవు తరఫు న్యాయవాది శ్రవణ్ కుమార్ కోర్టుకు వివరించారు. ప్రాజెక్టు వల్ల యాభై వేల మంది ముంపునకు గురయ్యారని పుల్లారావు తరఫు న్యాయవాది వివరించారు. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన మూడు అప్పీళ్ళను విచారించేందుకు సుప్రీంకోర్టు కేసును వాయిదా వేసింది.

Updated Date - 2022-09-26T20:02:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising