ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: ఒక్క రాజధానికే నిధులు.. అజెండాలో స్పష్టం చేసిన కేంద్రం

ABN, First Publish Date - 2022-09-13T22:03:33+05:30

ఒక్క రాజధానికే నిధులిస్తామని కేంద్ర ప్రభుత్వం (Central Govt.) స్పష్టం చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ (Delhi): ఒక్క రాజధానికే నిధులిస్తామని కేంద్ర ప్రభుత్వం (Central Govt.) స్పష్టం చేసింది. రాష్ట్ర విభజన అంశాలపై ఈనెల 27న కేంద్ర హోంశాఖ సమావేశం కానుంది. విభజన చట్టం ప్రకారం రాజధానికి కేంద్రం సహకారంపై సమావేశంలో చర్చించనున్నారు. కొత్త రాజధానికి నిధులు అని మాత్రమే కేంద్ర హోంశాఖ అజెండాలో తెలిపింది. మూడు రాజధానులపై అజెండాలో ప్రస్తావనే లేదు. పదే పదే మూడు రాజధానులని చెబుతున్న జగన్మోహన్ రెడ్డికి కేంద్రం షాకిచ్చిందనే చెప్పవచ్చు. గతంలో ఏపీ హైకోర్టు.. రాజధానిగా అమరావతే ఉంటుందని తీర్పు ఇచ్చినప్పటికీ.. ఈ నెలలో ప్రారంభం కాబోతున్న అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానులకు సంబంధించి బిల్లు పెడతామని చెబుతన్న సీఎం జగన్‌కు కేంద్రం షాకిచ్చింది.


కాగా 27న జరగనున్న సమావేశంలో విభజన అంశాలకు సంబంధించి అన్ని అంశాలపై చర్చించనున్నారు. విభజన చట్టం ప్రకారం రాజధానికి కేంద్ర సహకారంపై ఈ భేటీలో చర్చించబోతున్నామంటూ కేంద్ర హోంశాఖ ఏపీ, తెలంగాణకు పంపించిన అజెండాలో పేర్కొంది. రాజధాని నగరం నుంచి ర్యాపిడ్‌ రైల్‌ అనుసంధానం అంశాన్ని కూడా హోం శాఖ  పొందుపరిచింది. ఇరు రాష్ట్రాల మధ్య పరిష్కారం, విభజన కావాల్సిన అంశాల్లో... షెడ్యూల్‌ 9లో ఉన్న ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్లు, షెడ్యూల్‌ 10లో ఉన్న రాష్ట్ర సంస్థల విభజన, విభజన చట్టంలో పేర్కొనని సంస్థల పంపిణీ, ఏపీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, సింగరేణి కాలరీస్‌, ఏపీ హెవీ మెషినరీ ఇంజనీరింగ్‌, నగదు, బ్యాంకు బ్యాలెన్సులు. విదేశీ సాయంతో చేపట్టిన ప్రాజక్టులపై తీసుకున్న అప్పుల విభజన. తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థల నుంచి ఏపీ విద్యుత్‌ పంపిణీ సంస్థలకు ఇవ్వాల్సిన నిధులు తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నట్లు కేంద్ర హోంశాఖ పేర్కొంది.


ఏపీ, తెలంగాణ ప్రధాన కార్యదర్శులు, కేంద్ర ఆర్ధిక శాఖలోని రెవెన్యూ, ఎక్స్‌పెండీచర్‌, ఆర్ధిక సర్వీసులు, ఎకనమిక్‌ అఫైర్స్‌ కార్యదర్శులు, ఆహార, విద్య, వ్యవసాయ కార్యదర్శులు, పెట్రోలియం, సహజ వాయువులు కార్యదర్శి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి, రైల్వే బోర్డు ఛైర్మన్‌లు ఈ సమావేశానికి హాజరు కావాలని కేంద్ర హోం శాఖ డైరక్టర్‌ పార్థసారధి ఈ మేరకు సర్య్కూలర్ విడుదల చేశారు.

Updated Date - 2022-09-13T22:03:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising