ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP NEWS: అసెంబ్లీ సాక్షిగా జగన్ అబద్ధాలు: సత్య కుమార్

ABN, First Publish Date - 2022-09-25T23:22:02+05:30

అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి(cm jagan reddy) చాలా అబద్ధాలు చెప్పారని.. వాటి నుంచి భయట పడటానికి, ప్రజల దృష్టిని మళ్లించడానికి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ‌కి వైఎస్ పేరు మార్చారని బీజేపీ జాతీయ కార్యదర్శి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి(cm jagan reddy) చాలా అబద్ధాలు చెప్పారని.. వాటి నుంచి భయట పడటానికి, ప్రజల దృష్టిని మళ్లించడానికి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ‌కి వైఎస్ పేరు మార్చారని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్(Satya Kumar) వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి టూ అరసవల్లి రైతుల పాదయాత్రకు బీజేపీ సంఘీభావం తెలుపుతూ, కంటికి రెప్పలా కాపాడుతుందని హామీ ఇచ్చారు. అమరావతి రైతులకు సంఘీభావంగా నిలబడి పోరాటానికి సిద్ధంగా ఉన్నామన్నారు. రేపు జగనన్న సింహాచలం, వైఎస్సార్ అన్నవరం పేరు మార్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు..రేపు పుట్టబోయే బిడ్డకు జగనన్న లేదా వైఎస్సార్ పేరు పెట్టాలని చట్టం తెచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదని సెటైర్లు వేశారు.


వికేంద్రీకరణపై, రాజకీయలే ధ్యేయంగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారని మండిపడ్డారు. 3 సంవత్సరాలుగా ఉత్తరాంధ్ర అభివృద్ధిపైన ఎందుకు సమావేశం పెట్టలేదని ప్రశ్నించారు. ఉత్తరాంధ్రకు మూడేళ్లలో సీఎం జగన్(cm jagan) ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్రలో ఒక్క ప్రాజెక్టైనా ... ఒక్క పరిశ్రమైనా  తీసుకొచ్చారా అని నిలదీశారు. వైసీపీ నేతలు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి  అమరావతి రైతుల మీద దాడి చేయడం కోసమే ఇదంతా చేస్తున్నారని ధ్వజమెత్తారు. లేపాక్షి నాలెడ్జ్ భూములు, అమ్మకాలను కచ్చితంగా అడ్డుకొని తీరుతామని హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్టు(Polavaram project) పూర్తి కావడం జగన్‌కి ఇష్టం లేదని సత్య కుమార్ తెలిపారు.

Updated Date - 2022-09-25T23:22:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising