ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

controversial comments: న్యాయవ్యవస్థపై వైసీపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2022-08-01T21:15:07+05:30

న్యాయవ్యవస్థపై వైసీపీ ఎంపీ సంజీవ్‌కుమార్ (YCP MP Sanjeev Kumar) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: న్యాయవ్యవస్థపై వైసీపీ ఎంపీ సంజీవ్‌కుమార్ (YCP MP Sanjeev Kumar) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. న్యాయవ్యవస్థలో బీసీలు లేనందునే ఆ సామాజికవార్గానికి అన్యాయం జరుగుతోందని తప్పుబట్టారు. న్యాయవ్యవస్థ ఘోరంగా ఉందని వ్యాఖ్యానించారు. వాళ్ల జడ్జీలను వారే నియమించుకుంటున్నారని విమర్శించారు. న్యాయవ్యవస్థలో రిజర్వేషన్‌ (Reservation)లు లేవని ఆరోపించారు. 6-7 శాతం మంది బీసీలు మాత్రమే న్యాయవ్యవస్థలో తెలిపారు. న్యాయవ్యవస్థలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఉండాలని అభిప్రాయపడ్డారు. అక్కడ కూర్చున్నంత మాత్రన దేవుళ్లు అయిపోరని, భావోద్వేగాలకు అనుగుణంగా తీర్పులుండాలని సంజీవ్‌కుమార్ పేర్కొన్నారు. న్యాయవ్యవస్థ దుర్బుద్ధితో 50% రిజర్వేషన్ల పరిమితి విధించిందని తప్పుబట్టారు. దీనికి ఎక్కడా చట్టబద్ధత లేదని సంజీవ్‌కుమార్ ప్రకటించారు. రాజ్యాంగం సుప్రీంకోర్టు (Supreme Court)కు ఇచ్చిన అధికారాలను దుర్వినియోగం చేస్తూ.. 50% రిజర్వేషన్ల పరిమితి విధించారని, ఇది తక్షణమే ఎత్తివేయాలని సంజీవ్‌కుమార్ డిమాండ్ చేశారు.


గతంలో అన్ని వ్యవస్థలు వాటి పరిధిలో ఉండాలని, లేకపోతే వ్యవస్థలన్నీ కుప్పకూలిపోతాయని ఏపీ హైకోర్టును ఉద్దేశించి సీఎం జగన్‌ (CM Jagan) వ్యాఖ్యానించారు. రాష్ట్ర హైకోర్టు (High Court) పరిధి దాటి పనిచేస్తోందని విమర్శించారు. అలాగే న్యాయమూర్తులపై భారత ప్రధాన న్యాయమూర్తికి జగన్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును బహిరంగంగా పత్రికలకు విడుదల చేశారు.  

Updated Date - 2022-08-01T21:15:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising