ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుపతిలో రూ.50లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం

ABN, First Publish Date - 2022-01-30T11:57:14+05:30

వాహనంతోపాటు రూ.50లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి డివిజన్‌ ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: వాహనంతోపాటు రూ.50లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి డివిజన్‌ ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ (ఎఫ్‌ఆర్‌వో) దొరస్వామి మీడియాకు శనివారం వివరాలు తెలిపారు. ముందుగా అందిన సమాచారం మేరకు డీఎ్‌ఫవో ఆదేశాలతో డాగ్‌ స్క్వాడ్‌, సిబ్బందితో కలసి దొరస్వామి శ్రీకాళహస్తి నుంచి రేణిగుంట వైపు వచ్చే వాహనాలను శుక్రవారం సాయంత్రం తనిఖీ చేస్తున్నారు. ఇంతలో ఓ కారు ఏర్పేడు నుంచి రేణిగుంటవైపు వేగంగా వస్తుండగా ఆపారు. 


కానీ ఆ వాహనం ఆగకుండా వెళ్లిపోవడంతో వెంబడించారు. ఈ క్రమంలో కారు పంక్చరు కావడంతో అందులోనివారు వాహనాన్ని వదిలి పరారయ్యారు. డాగ్‌ స్క్వాడ్‌ సాయంతో వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించగా.. సీట్ల కింద కనిపించకుండా దాచి ఉంచిన 16 ఎర్రచందనం దుంగలను గుర్తించారు. కారుతోపాటు వాటిని స్వాధీనం చేసుకున్నారు. దుంగల బరువు 502 కిలోలుండగా, దాదాపు రూ.50 లక్షలకుపైగా విలువ ఉంటుందని ఎఫ్‌ఆర్‌వో తెలిపారు. ఈ దాడిలో డీఆర్‌వోలు విజయకుమార్‌, షరీఫ్‌, సికిందర్‌, ఎఫ్‌బీవోలు జాన్‌, పురుషోత్తం, పీడబ్ల్యూఎస్‌ మోహన్‌, సునీల్‌, లీలాప్రసాద్‌, క్రాంతికుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-01-30T11:57:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising