సాయిరెడ్డి రాక్షసానందం
ABN, First Publish Date - 2022-08-04T07:48:53+05:30
సాయిరెడ్డి రాక్షసానందం
సంఘ విద్రోహ శక్తుల
ముఠాగా వైసీపీ సోషల్ మీడియా
దేవేందర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలి
పోలీసులకు టీడీపీ ఫిర్యాదు
మంగళగిరి సిటీ, ఆగస్టు 3: జగన్‌రెడ్డి ప్రోత్సాహంతో సంఘ విద్రోహ శక్తులన్నీ ముఠాగా ఏర్పడి వైసీపీ సోషల్ మీడియా వేదికగా పని చేస్తున్నాయని, ఎంపీ విజయసాయిరెడ్డి సిగ్గు, లజ్జ లేకుండా విషపూరితమైన ట్వీట్లు పెడుతూ రాక్షసానందం పొందుతున్నారని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు విమర్శించారు. ఎన్టీఆర్ కుమార్తె ఉమామహేశ్వరి మృతిపై వైసీపీ సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ దేవేందర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎమ్మెల్సీ అశోక్‌బాబు, టీడీపీ నేతలు ఆనందబాబు, ఆలపాటి రాజేంద్రప్రసాద్ తదితరులు గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ సీఐ భూషణానికి బుధవారం రాత్రి ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసు స్టేషన్ వెలుపల ఆనందబాబు, రాజా విలేకరులతో మాట్లాడుతుండగా.. రూరల్ సీఐ భూషణం అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో టీడీపీ శ్రేణులు, సీఐకి మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. అందరిపై కేసులు పెట్టండంటూ సీఐ వ్యాఖ్యానించడంతో టీడీపీ నేతలు భగ్గుమన్నారు. ఈలోగా పట్టణ సీఐ అంకమ్మరావు అక్కడకు చేరుకుని సర్ది చెప్పారు.
Updated Date - 2022-08-04T07:48:53+05:30 IST