ముగిసిన ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజనీర్ల సంఘం ఎన్నికలు
ABN, First Publish Date - 2022-10-17T10:24:44+05:30
ఏపీ గ్రామీణ నీటి సరఫరా సంస్థ (ఆర్‌డబ్ల్యూఎస్) ఇంజనీర్ల సంఘం ఎన్నికలు కోలాహలంగా జరిగాయి. విజయవాడలో జరిగిన ఎన్నికల్లో పరోక్షంగా ఆర్‌డబ్ల్యూఎస్
విజయవాడ, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): ఏపీ గ్రామీణ నీటి సరఫరా సంస్థ (ఆర్‌డబ్ల్యూఎస్) ఇంజనీర్ల సంఘం ఎన్నికలు కోలాహలంగా జరిగాయి. విజయవాడలో జరిగిన ఎన్నికల్లో పరోక్షంగా ఆర్‌డబ్ల్యూఎస్ ఈఎన్‌సీ బలపరిచిన ప్యానెల్ విజయం సాధించింది. అధ్యక్షుడిగా కుమార్ ఆకుల, ఉపాధ్యక్షుడిగా పిక్కి గాంధారరావు, ప్రధాన కార్యదర్శిగా సంతోష్, సంయుక్త కార్యదర్శిగా ఎం.హేమాద్రి, కోశాధికారిగా ఎం.తిరుపతినాయుడు విజయం సాధించారు. ఆర్గనైజిం గ్ సెక్రటరీగా ఎస్.రామకృష్ణ, టెక్నికల్ సెక్రటరీగా బి.బాలకృష్ణ, మహిళా కార్యదర్శిగా మెహ్రాజ్ సుల్తానా గెలుపొందారు. ఏపీ ఎన్జీవో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎ.విద్యాసాగర్, ఇక్బాల్ ఎన్నికల అధికారులుగా వ్యవహరించారు.
Updated Date - 2022-10-17T10:24:44+05:30 IST