ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మే 31లోగా రోడ్లు బాగు చేయాలి

ABN, First Publish Date - 2022-10-08T09:42:16+05:30

మే 31లోగా రోడ్లు బాగు చేయాలి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మున్సిపాలిటీల్లో వ్యర్థాల నిర్వహణను పరిశీలించాలి: సీఎం 


అమరావతి, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వర్షాలు బాగా కురుస్తున్నాయని పట్టణాలు, నగరాల్లో రోడ్ల పరిస్థితిని మళ్లీ పరిశీలించాలని సీఎం జగన్‌ ఆదేశించారు. పనుల సీజన్‌ ప్రారంభం కాగానే డ్రైవ్‌ చేపట్టాలని, మే 31 నాటికల్లా అన్ని రోడ్లనూ మళ్లీ బాగు చేయాలని సూచించారు. సీఎం క్యాంప్‌ కార్యాలయంలో శుక్రవారం ఆయన మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. చెత్త నిర్వహణ కేంద్రాల కారణంగా వాటి పరిసరాల్లోని ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. నిర్వహణలో ఎలాంటి స్వచ్ఛ ప్రమాణాలు పాటిస్తున్నామో అవగాహన కల్పించాలన్నారు. ప్రతి మున్సిపాల్టీలోనూ వ్యర్థాల నిర్వహణ ప్రక్రియ అమలు తీరును పరిశీలించాలని ఆదేశించారు. ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలపై నిషేధాన్ని పూర్తిగా అమలు చేసేందుకు సంబంధిత వ్యాపారులతో కలెక్టర్లు సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. ఇప్పించిన రుణాలను సకాలంలో చెల్లించే వారికి ప్రభుత్వం నుంచి వడ్డీ రాయితీ కల్పించేలా ఆలోచన చేయాలన్నారు. జగనన్న కాలనీల్లో మురుగునీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. జగనన్న స్మార్ట్‌ టౌన్‌షి్‌ప కార్యక్రమం ద్వారా ప్రతి నియోజకవర్గానికీ ఒక లేఅవుట్‌ను తీర్చిదిద్దాలని ఆదేశించారు. సమావేశంలో మంత్రి ఆదిమూలపు సురేశ్‌, సీఎస్‌ సమీర్‌శర్మ, తదితరులు పాల్గొన్నారు. 


సీఈవోను కలిసిన యువ ఐఏఎ్‌సలు
2021 బ్యాచ్‌కు చెందిన 9మంది ప్రొబేషనరీ ఐఏఎస్‌ అధికారుల బృందం శుక్రవారం అమరావతి సచివాలయంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్‌కుమార్‌ మీనాను కలిసింది. ఈ బృందంలో ధాత్రిరెడ్డి, మేఘస్వరూప్‌, ప్రఖర్‌జైన్‌, జి.విధ్యాధరి, శివన్నారాయణశర్మ, అశుతోష్‌ శ్రీవాస్తవ, అపూర్వ భరత్‌, రాహుల్‌ మీనా, ప్రశాంత్‌ కుమార్‌ ఉన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ విధానాన్ని సీఈవో వారికి వివరించారు. అనంతరం తాడికొండ గ్రామంలో ఈ బృందం పర్యటించి ఓటర్ల నమోదు, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పరిశీలించింది. 

Updated Date - 2022-10-08T09:42:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising